Evaru Meelo Koteeswarulu: మెగా-నందమూరి ఫాన్స్ కి ఫీస్ట్ అంతే.. ఆసక్తి పెంచేస్తోన్న ప్రోమో!
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను బుల్లితెర ద్వారా పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక రియాలిటీ గేమ్ షో ఒకటి ఆయన హోస్ట్ గా టెలీకాస్ట్ కావడానికి సిద్ధమవుతోంది. జెమిని టీవీలో ఈ షో టెలికాస్ట్ కాబోతోంది. దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. చరణ్ సందడి చేసిన ఈ షో ూిేచే వివరాల్లోకి వెళితే

ఆ షోకి మార్పులు
ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో మా టీవీలో పాపులర్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ షో ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో. క్విజ్ గేమ్ షోగా ప్రసారం అయిన దీనికి అన్ని భాషల మాదిరిగానే మన దగ్గర కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించిన ఐదో సీజన్ మాత్రం ఎంతో గ్రాండ్‌గా రాబోతుంది. ఈ సారి దీన్ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు.

ఎండకో గాప్
గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి వంటి వారు నడిపించిన ఈ షోను.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒంటి చేత్తో నడిపించబోతున్నాడు. గతంలో బిగ్ బాస్ షోను సక్సెస్‌ఫుల్ చేసిన అనుభవం ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను కూడా అలానే హిట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పడంతో షో మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిజానికి టెలివిజన్ హిస్టరీలోనే సూపర్ హిట్ షోగా పేరొందిన వాటిలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. నాలుగు సీజన్లు పూర్తైనా తర్వాత ఎందుకో తెలియదు కానీ ఐదో సీజన్ మొదలెట్టలేదు.

ప్రతి రోజూ
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు నుంచి ప్రసారం చేయబోతున్నారు అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా దీన్ని ఆగస్టు 15 నుంచి మొదలు పెడతారన్న టాక్ వినిపించగా నిన్న ప్రోమోలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ఐదో సీజన్‌ను ఆగస్టు 22 నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

చిరు బర్త్ డేకి
ఇక ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే మొదటి ఎపిసోడ్‌కు యువ కథానాయకుడు రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేసి సందడి చేశారు. ఎన్టీఆర్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఒక ప్రోమో పంచుకుంటూ ''ఈనెల 22న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నాం. సోదరుడు రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ఈ కర్టెన్ రైజర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశారు. ఇక ఈ ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి సందడి చేశారు.

సినిమాల విషయానికి వస్తే
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇప్పుడు మళ్లీ రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసి నటిష్టున్న ఆ సినిమా ఇప్పట్లో ఆ రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఇద్దరూ తన అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చేలా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ద్వారా బుల్లితెర మీద కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











