రకుల్, కేటీఆర్ సేమ్ టూ సేమ్!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్‌లో కేటీఆర్.. ఐటీ, పంచాయతీ రాజ్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, పురపాలక శాఖ, పరిశ్రమలు వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. మఖ్యంగా ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్ వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు కేటీఆర్. అనేక దేశాల్లో పర్యటించి హైదరాబాద్‌కు వేల కోట్ల పెట్టుబడులు రావడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తదితర నగరాల్లో ఐటీ కంపెనీల విస్తరణకు కృషి చేశారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడంతో కేటీఆర్ మరోసారి ఐటీ , పరిశ్రమల శాఖను నిర్వర్తించారు. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చారు. ఆయన కృషి ఫలితంగా లక్షలాది మంది విద్యార్ధులు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ .. టీ-హబ్ ఏర్పాటు, సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతి తదితర అంశాలను కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు.

తండ్రి పార్టీ అధినేత, స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో కేటీఆర్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటికి ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేవారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా విపక్షనేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా ఆయన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి నుంచి పెట్స్‌ను పెంచుకోవడంపై మక్కువ చూపే తారక రామారావు ఓ కుక్కపిల్లతో ఉన్న ఫోటో అది. అయితే యాదృచ్ఛికంగా కేటీఆర్ వద్ద ఉన్న లాంటి కుక్క పిల్లే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వద్దా కనిపించింది. ఆమె కూడా తన పెట్ డాగ్‌తో దిగిన ఫోటోను ఆన్‌లైన్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం కేటీఆర్, రకుల్ ప్రీత్ సింగ్‌లు కుక్కలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉండగా.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన రకుల్.. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో రెండు చేతులా సంపాదించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోల పక్కన ఛాన్స్‌లు కొట్టేసి సౌత్‌ను దున్నేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రేజ్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన రకుల్ ప్రీత్‌కు అక్కడ పరిస్ధితి ఏమాత్రం కలిసి రావడం లేదు. అయనప్పటికీ పట్టు వదలకుండా ట్రై చేస్తూనే ఉంది.
ఇటీవల శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు-2 సినిమాలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో తన వర్కవుట్స్ ఫోటోలను, కొత్త కొత్త ఫోటో షూట్‌లను వాటిలో పంచుకుంటూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











