మాజీ సీఎం కూతురికి టోకరా.. హీరోయిన్ ఆఫర్ అంటూ 6 కోట్లు కొట్టేశారట.. ఎక్కడంటే?

చాలా మందికి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకొందరికి అది చాలా వీక్నెస్ అని చెప్పవచ్చు. కాగా ఇక్కడే వీక్నెస్ మరొకరికి మోసం చేసి డబ్బులు తెచ్చిపెట్టే మాధ్యమంగా కూడా మారుతుంది. ఇలా సినిమాలు పేర్లు చెప్పి ఎప్పటికప్పుడు చాలా మోసాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

మన తెలుగు తమిళ్, కన్నడ మలయాళం, హిందీ సినిమాల్లో కూడా పలు రాకెట్ లు నటన, అవకాశాలు ఇప్పిస్తామని ఇలా అనేక అంశాల్లో అమాయకులని దోచుకుంటూనే ఉంటున్నారు. సరే కొందరు అవగాహన లేకుండా డబ్బులు పోగొట్టుకుంటున్నారు అనుకోవచ్చు, కానీ ఇంకొందరు తెలిసి మరీ వెళ్లి భారీ నష్టాలు చూస్తున్నారు.

Ex Uttarakhand CM daughter Arushi Nishank cheated with 6 crore in the name of Heroine Role offer

ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఏకంగా 6 కోట్లు పోగొట్టుకున్న వార్తలు ఇపుడు నార్త్ మీడియా నుంచి బయటకి వచ్చాయి. కాగా ఉత్తరాఖండ్ కి చెందిన మాతాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ కి మొత్తం ముగ్గురు సంతానం అయితే వారిలో ఆరుషి నిషాంక్ కూడా ఒకామె. కాగా ఆరుషి తన తండ్రిలా పాలిటిక్స్ కి భిన్నంగా మోడలింగ్, నటన అలాగే నాట్య కళలో కూడా ఆరితేరింది.

ఇలా అటు సైడ్ నే పలు వెబ్ సిరీస్ లు కూడా చేయగా ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమెకి ఎప్పటి నుంచో హీరోయిన్ అవ్వాలనే కోరిక కూడా మెండుగా ఉందట. ఎలానో మంచి ఉంది ఆమెలో కూడా హీరోయిన్ కావాలనే కోరిక ఉందని తెలుసుకున్న కొందరు డెహ్రాడూన్ లో డైరెక్ట్ గా ఆమె ఇంటికే వెళ్లి తాము ఓ సినిమా చేస్తాము అందులో పవర్ఫుల్ రోల్ మీకు ఉంది మీరే మెయిన్ లీడ్ అంటూ ఆమె వీక్నెస్ మీద మొదట కొట్టారట.

అంతే ఆరుషి ఫ్లాట్ అయ్యింది. అయితే ఆమెని కూడా తమతో పాటుగా సినిమాకి బడ్జెట్ పెట్టాలని ఒక 5 కోట్లు ముందు కోరారట. మధ్యలో ఈ సినిమా చేస్తే డెఫినెట్ గా మీకు స్టార్డం వచ్చేస్తుంది అని చెప్పడంతో ఆమె నమ్మేసి ఆ 5 కోట్లు ఇచ్చిందట. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఇతర ఖర్చులు నిమిత్తం ఆమె నుంచి మరో కోటి పిండారట.

Ex Uttarakhand CM daughter Arushi Nishank cheated with 6 crore in the name of Heroine Role offer

మరి అంత డబ్బులు పెట్టింది, పైగా హీరోయిన్ ఆయా పైగా నిర్మాత కూడా కావడంతో ఓరోజు అసలు పనులు ఎంతవరకు వచ్చాయి అని ప్రశ్నించింది అట. అక్కడ నుంచి వారి సమాధానాలు భిన్నంగా వచ్చేవట. డబ్బులు అడగడానికి లేదని అడిగినా ఇచ్చేది లేదు, పైపెచ్చు ఆమెని చంపేస్తామని కూడా బెదిరింపులు చేశారట. దీనితో ఆమె డెహ్రడూన్ లోనే పోలీసులకి అసలు విషయం చెప్పి వారి మీద కేసు పెట్టిందట.

దీనితో ఈ మొత్తం మోసం కథ బయటకి వచ్చింది. కాగా ఈమెకి ఇలా జరగడంతో చాలా మంది ఆశ్చర్యనికి లోనవుతున్నారట. ఇంత సింపుల్ గా ఎలా మోసపోయింది అని. కాగా ఇలా మొత్తంగా 6 కోట్లు పోగొట్టుకున్న ఈ బ్యూటీ హీరోయిన్ అవ్వకుండానే ఇలా వార్తల్లోకి రావాల్సి వచ్చింది.

More from Filmibeat

Read more about: movie offer bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X