Extra Ordinary Man twitter review శ్రీలీల, నితిన్ హిట్టు కొట్టారా?
యువ హీరో నితిన్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్. ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంత వంశీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను నిర్మాత సుధాకర్ రెడ్డి నిర్మించారు. శ్రేష్ట్ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి నెటిజన్లు ట్విట్టర్‌లో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ చూశాను. సెకండాఫ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ బాగుంది. వార్నింగ్ సీన్, ఇంట్రడక్షన్ సీన్, ఛార్జ్ సీన్, పెళ్లి సంబంధం సీన్ అదిరిపోయాయి. రాజశేఖర్ సీన్స్ అండ్ ఫన్ సాంగ్ పెట్టే తాళం తెరిచే సాంగ్ సినిమాకు హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా స్లాప్ స్టిక్ కామెడీ ఉంది. కానీ సింక్ లేకుండా ఈ కామెడీ ఏంటి రా బాబు.. సినిమా డిజాస్టర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నితిన్ నుంచి వచ్చిన మంచి కామెడీ సినిమా ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టాక్ వినిపిస్తున్నది. ఏజెంట్, నా పేరు సూర్య సినిమాల ఫ్లాప్ తర్వాత తను కంఫర్ట్ జోన్ అయిన కామెడీతో వక్కంత వంశీ కమ్ బ్యాక్ చేశారు. శ్రీలీల సూపర్ క్యూట్‌గా ఉంది. సూపర్ ఎనర్జీగా కనిపించింది. ఆమె వేసిన స్టెప్పులతో సినిమా హిట్‌గా మారింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో పాటలు అదరగొట్టాయి. బ్రష్ వేసుకో, సిర్రాక్ తాండవ సినిమా పాటలు ఫస్టాఫ్‌లో బాగున్నాయి. మెలోడితో కూడిన పాటల్లో డ్యాన్స్ ఆకట్టుకొనేలా ఉంది అని ఓ నటెిజన్ కామెంట్ చేశాడు.
సిల్వర్ స్క్రీన్‌పై ఫన్ రైడ్ మొదలు అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. నితిన్, శ్రీలీలకు ఆల్ ది బెస్ట్. రష్మిక ఫ్యాన్స్ నుంచి యూనిట్ అందరికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్ కోసం నితిన్ అమెరికా వెళ్లారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శించే ప్రీమియర్స్ కోసం ప్రమోషన్స్ చేపట్టారు. యూఎస్‌లో ఉన్న ప్రవాసాంధ్రులతో నితిన్ భేటి అయ్యారు. భారతీయుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నది.


Click it and Unblock the Notifications











