అనిల్ రావిపూడి తదుపరి చిత్రం.. లేడి ఓరియెంటెడ్ కథతో ప్రయోగం!
ఎఫ్2 విజయంతో యువ దర్శకుడు అనిల్ రావిపూడి టాలీవుడ్ అగ్రదర్శకుడిలా జాబితాలో చేరిపోయాడు. పటాస్ చిత్రంతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి ఇంతవరకు పరాజయమే లేదు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఇప్పుడు ఎఫ్2 చిత్రంతో వరుస విజయాలతో అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. దీనితో అనిల్ రావిపూడి తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్యతో ఎప్పటికైనా సినిమా చేస్తానని అనిల్ రావిపూడి ప్రకటించాడు.
బాలయ్య తదుపరి బోయపాటి శ్రీను దర్శత్వంలో బిజీకాబోతున్నాడు. దీనితో అనిల్ రావిపూడి ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రంతో ప్రయోగం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అనిల్ రావిపూడి కసరత్తు ప్రారంభించాడట. ఈ చిత్రాన్ని కూడా అనిల్ రావిపూడి తనదైన శైలిలో కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో జరుగుతున్నఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇదిలా ఉండగా ఎఫ్2 చిత్రం రెండవ వారంలో కూడా అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం ఇప్పటికే 60 కోట్ల షేర్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











