ఎఫ్2 టీజర్: నవ్వించిన వెంకీ, వరుణ్ తేజ్... తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత!
వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతికి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
దిల్ రాజు బేనర్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఈ పండక్కి నవ్వించయడం ఖాయం అనేలా ఉంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వెంకీ తనదైన శైలిలో కామెడీ పండిస్తుంటే... వరుణ్ తేజ్ సపోర్ట్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.

పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత
ఒక చరిత్ర గురించి చెప్పాలంటే... క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత సర్.... అంటూ వెంకీ తనదైన శైలిలో అదరగొట్టారు. ఇందులో పెళ్లానికి భయపడే పాత్రలో వెంకీ నటించినట్లు తెలుస్తోంది. ఆయన భార్య పాత్రలో తమన్నా కనిపించనున్నారు.

తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత
ఒక చరిత్ర గురించి చెప్పాన్నంటే... తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అంటూ వరుణ్ తేజ్ మొదలు పెట్టగా... వెంకీ కల్పించుకుని ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు భయ్యా అంటూ ఆపడం లాంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి.

ఇద్దరూ పెళ్లాం బాధితులేనా?
ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటూ వెంకీ ఆపే ప్రయత్నం చేయగా... నేనేం నీలెక్క కాదు పెళ్లాన్ని కంట్రోల్ చేయడం నాకు మస్త్ తెలుసు అంటూ వరుణ్ తేజ్ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ టైజర్లో హైలెట్ అయ్యాయి. అయితే చివరకు ఇద్దరూ పెళ్లాం బాధితులుగా మారుతారని, ఆ ఫ్రస్టేషన్ నుంచి పయటపడేందుకు వారు చేసే ప్రయత్నాలు నవ్విస్తాయని తెలుస్తోంది.
ఎఫ్2 టీజర్
దిల్ రాజు మాట్లాడుతూ... త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ఫంక్షన్ చేయబోతున్నాం. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్‌లో వస్తోన్న ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైటర్ ఎఫ్2. మెసేజ్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులను పర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడర్‌లాంటి సినిమాను అనిల్ రావిపూడి పూడి తెరెక్కించాడని తెలిపారు.


Click it and Unblock the Notifications











