వెంకీ, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ గురించి హాట్ అప్డేట్
వెంకటేశ్, ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎఫ్-2' ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గ్యాపులో టీజర్ రిలీజ్, ఆడియో రిలీజ్ లాంటి ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. . డిసెంబర్ 12న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ఫంక్షన్ చేయబోతున్నాం. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్‌లో వస్తోన్న ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైటర్ ఎఫ్2. మెసేజ్‌తో పాటు అన్ని కమర్షియల్ హంగులను పర్‌ఫెక్ట్‌గా యాడ్ చేసి లాఫింగ్ రైడర్‌లాంటి సినిమాను అనిల్ రావిపూడి పూడి తెరెక్కించాడని దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











