F3 1st Week Collections: 64 కోట్ల టార్గెట్.. వారంలోనే ఊహించని వసూళ్లు.. అన్ని కోట్లు వస్తేనే హిట్

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా బాగా కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేక్షకులు, హీరోల అభిమానుల ఆలోచనా ధోరణిలో మార్పులు వచ్చాయి. దీనికితోడు హీరోలు సైతం ఈ తరహా సినిమాలు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అంతేకాదు, ఇలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో చాలా కాలంగా తెలుగులో మల్టీస్టారర్ మూవీలు మరిన్ని పట్టాలెక్కుతున్నాయి. ఇలా వచ్చి హిట్ అయిన చిత్రమే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). దీనికి సీక్వెల్‌గా F3 మూవీని రూపొందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి వారం ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

కడుపుబ్బా నవ్వించేలా వచ్చింది

కడుపుబ్బా నవ్వించేలా వచ్చింది

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రమే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగం అయ్యారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

ఎఫ్3 మూవీ థియేట్రికల్ బిజినెస్

వెంకటేష్, వరుణ్ తేజ్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీనికితోడు F2 వంటి భారీ హిట్ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఎఫ్3'కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో కలుపుకుని భారీ స్థాయిలో రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే విడుదలైంది.

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది


'ఎఫ్ 3'కు తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కలెక్షన్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.47 కోట్లు షేర్, రూ. 2.40 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

మొదటి వారంలో ఎంత వచ్చింది

మొదటి వారంలో ఎంత వచ్చింది

'ఎఫ్ 3' మూవీకి వారం రోజులకు కలిపి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 16.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.18 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.86 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.10 కోట్లు, గుంటూరులో రూ. 2.82 కోట్లు, కృష్ణాలో రూ. 2.48 కోట్లు, నెల్లూరులో రూ. 1.55 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 38.77 కోట్లు షేర్, రూ. 62.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది


ఆంధ్రా, తెలంగాణలో రాణించిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ పర్వాలేదనిపించింది. రెండు రాష్ట్రాల్లో వారం రోజులకు రూ. 38.77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.75 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లోనే ఈ మూవీ రూ. 48.17 కోట్లు షేర్, రూ. 80.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ఎఫ్ 3' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.17 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 16.33 కోట్లు వస్తే ఇది విజయాన్ని సాధిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X