twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 Censor: ఎఫ్3 మూవీకి ఆ సర్టిఫికెట్.. ఏకంగా అన్ని గంటలు పొట్ట చెక్కలే

    |

    ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి, ఫ్యాన్స్ ఆలోచనా ధోరణిలో పూర్తిగా మార్పులు రావడమే. దీనికితోడు ఇలా వచ్చిన కొన్ని చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఫలితంగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ కనిపిస్తోంది. ఇలా కొన్నేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీనే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు వర్షం కురిపించింది. ఫలితంగా భారీ విజయాన్ని అందుకుంది.

    <strong>Happy Birthday NTR: సినీ చరిత్రలో తారక్‌దే ఆ రికార్డు.. ఆస్తుల విలువ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే!</strong>Happy Birthday NTR: సినీ చరిత్రలో తారక్‌దే ఆ రికార్డు.. ఆస్తుల విలువ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే!

    ఫన్ రైడ్‌గా వచ్చిన 'F2' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్‌గా 'F3'ని రూపొందించాలని చిత్ర యూనిట్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయింది. ఇక, 'F3' పేరిట ఈ సినిమాను రెండేళ్ల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించారు. అయితే, మధ్యలో అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి కంప్లీట్ అవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే జరిగిన స్పెషల్ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్ భాగం మొత్తాన్ని పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేశారు.

     F3 Movie Censor and Run Time Details

    హిట్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'F3'లో ముగ్గురు హీరోలు నటిస్తారని ఆరంభం నుంచే వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగాన్ని పెళ్లి వల్ల వచ్చే కష్టాలతో తెరకెక్కించగా.. దీన్ని మాత్రం మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో రూపొందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక, ఈ సినిమాలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా తీసుకొచ్చి వాళ్లకు స్పెషల్ క్యారెక్టర్లు రాసుకున్నారు. అలాగే, మరెన్నో హైలైట్ పాయింట్లను కూడా ఈ సినిమాలో జత చేశారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

    స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజుస్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

    'F3' మూవీని మే 27న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలు, ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, ఎన్నో ఇంటర్వ్యూలు, స్పెషల్ చిట్ చాట్‌లు కూడా చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ (U) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, ఈ సినిమా 2 గంటల 28 నిమిషాల నిడివితో రాబోతుందని కూడా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో దాదాపు 2 గంటల పాటు పొట్ట చెక్కలయ్యే కామెడీనే ఉంటుందని అంటున్నారు.

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున చిత్రమే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇప్పుడు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగం అయ్యారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

    English summary
    Daggubati Venkatesh, Varun Tej Doing F3 Movie under Anil Ravipudi Direction. Now This Movie Censor and Run Time Details Out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X