F3 Movie: అన్ని వందల థియేటర్లలో ఎఫ్3.. ఆ భారీ చిత్రాలకు దగ్గరగానే!

గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ అభిమానుల అభిరుచిలో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఎన్నో రకాల విభిన్నమైన నేపథ్యాలతో చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో మల్టీస్టారర్ మూవీల గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. దీనికి కారణం కొంత కాలంగా ఇలాంటి సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ చాలా చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అలా ఇద్దరు స్టార్ల కలయికలో వచ్చిన భారీ సక్సెస్ అయిన సినిమానే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

'F2' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్‌గా 'F3'ని రూపొందించాలని చిత్ర యూనిట్ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అందుకు అనుగుణంగానే అవే పాత్రలతో సరికొత్త కథా నేపథ్యంలో ఈ సినిమా కథను అనిల్ రావిపూడి రెడీ చేసుకున్నాడు. ఇక, 'F3' పేరిట ఈ సినిమాను రెండేళ్ల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా వెంటనే మొదలు పెట్టారు. అయితే, మధ్యలో అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే జరిగిన స్పెషల్ సాంగ్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుని.. నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది.

F3 Movie Worldwide Total Theaters Count

సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'F3'లో డబ్బు వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని చూపించబోతున్నారు. దీనికోసం పాత పాత్రలనే కొత్తగా డిజైన్ చేయడంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింతగా పెంచినట్లు ఇప్పటికే విడుదలైన వీడియోల ద్వారా చూపించారు. ఇక, ఈ సినిమాలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా తీసుకొచ్చి వాళ్లకు స్పెషల్ క్యారెక్టర్లు రాసుకున్నారు. అలాగే, మరెన్నో హైలైట్ పాయింట్లను కూడా ఈ సినిమాలో జత చేశారు. ఇలా ఈ సినిమాను శుక్రవారమే (మే 27) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో పాటు.. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తుండడంతో 'F3'పై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ ధరలకు జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 270, సీడెడ్‌లో 170, ఆంధ్రాలో 340 వరకూ అంటే మొత్తంగా 780 నుంచి 800 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 110, ఓవర్సీస్‌లో 480 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1370 నుంచి 1400 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా ఇప్పటి స్టార్ హీరోల చిత్రాలకు సమానంగానే విడుల కాబోతుంది.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున చిత్రమే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇప్పుడు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగం అయ్యారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X