Just In
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
F3 నుంచి న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్: సినిమా ఎలా ఉంటుందో ఇలా చెప్పేశారుగా!
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. హీరోలు ఇగోలను పక్కన పెట్టేసి పచ్చజెండా ఊపడం వల్లే దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దీంతో ఆ తరహా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు విజయం సాధించాయి. ఇలా గత ఏడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రమే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
'F2' ఘన విజయం అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా 'F3' అనే మూవీని రూపొందిస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. సుదీర్ఘ విరామం తర్వాత ఈ మూవీ స్టోరీని రెడీ చేశాడు. ఇందులోనూ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వీళ్లతో పాటు మరో స్టార్ హీరో కూడా కీలక పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతోన్నా.. క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో వెంకీపై కొన్ని సీన్స్ షూట్ చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ అయింది. నూతన సంవత్సరం సందర్భంగా వదలిన ఈ స్పెషల్ పోస్టర్‌లో చిత్ర హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్‌లను మాత్రమే చూపించారు. అలాగే, గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్లను హైలైట్ చేశారు. దీంతో మనీ వల్ల వచ్చే ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఫస్ట్ పార్ట్ లాగే ఇది కూడా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీన్ని వేసవిలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Happy new year 🎉🎉🎉🎉 pic.twitter.com/bZ27vlTlGi
— Anil Ravipudi (@AnilRavipudi) January 1, 2021