Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుక: ‘F3’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంకటేష్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. అలాగే, కామెడీతో ప్రతి ఇంట్లో సందడిని తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తీయాలని డిసైడ్ అయింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే 'F3' పేరిట దీన్ని కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు.
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. సుదీర్ఘ విరామం తర్వాత ఈ మూవీ స్టోరీని రెడీ చేశాడు. ఇందులోనూ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వీళ్లతో పాటు మరో స్టార్ హీరో కూడా కీలక పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతోన్నా.. క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో వెంకీపై కొన్ని సీన్స్ షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ రూపొందుతోంది.
PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్
నేడు (జనవరి 19) చిత్ర హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని 'F3' నుంచి అతడున్న స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన విక్టరీ వెంకటేష్ 'హ్యాపీ బర్త్‌డే కో బ్రో. ఈ ఏడాది నువ్వు మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా' అని శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సహా నటీనటులంతా వరుణ్ తేజ్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.