Fact Check: కేటీఆర్ నా జీవితం నాశనం చేశాడు.. రకుల్ ప్రీత్ ఆరోపణలు.. వాస్తవం ఏమిటంటే?
గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు పుకార్లు రాయుళ్లు రెచ్చిపోతుంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు వారిపై ఉన్నది లేనిది కల్పించి రాసి వారి జీవితాన్ని రోడ్డు మీదకు ఈడ్చిన ఘటనలు ఎన్నో. నేటి సోషల్ మీడియా యుగంలో ఎన్నో వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్. వీటిలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్ధితి. హాట్ హాట్ థంబ్‌నెయిల్స్, టైటిల్స్‌తో పోస్టర్స్ వదలడం.. జనాన్ని ఎట్రాక్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ వండి వార్చడం ఈ మధ్య బాగా అలవాటైంది. తాజాగా ఇలాంటి ఫేక్ న్యూస్ బారినపడ్డారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగువారిని పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్ .. షార్ట్ గ్యాప్‌లోనే స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు వంటి స్టార్స్‌తో నటించే అవకాశం ఆమెకు త్వరగానే దక్కింది. టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. సౌత్‌లో కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. బాలీవుడ్‌లో అడుగుపెట్టి చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్.

హిందీలో ఆమె నటించిన సినిమాలు ఏమాత్రం సక్సెస్ కాకపోవడంతో రెండింటికి చెడ్డ రెవడిలా ఆమె పరిస్ధితి తయారైంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు. అయినప్పటికీ అవకాశాల కోసం పట్టు వదలకుండా ట్రై చేస్తూనే ఉంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై గాసిప్స్ సర్వసాధారణం .. అలాగే రకుల్ పైనా ఎంతో దుష్ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో తన వర్కవుట్స్ ఫోటోలను, కొత్త కొత్త ఫోటో షూట్‌లను వాటిలో పంచుకుంటూ ఉంటుంది. అదే ఆమె కొంప ముంచుతోంది. మొన్నామధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వద్ద ఉన్న లాంటి కుక్క పిల్లే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వద్దా కనిపించింది. ఆమె కూడా తన పెట్ డాగ్‌తో దిగిన ఫోటోను ఆన్‌లైన్‌లో షేర్ చేయగా వారిపై ఉన్నది లేనిది స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియా జనాలు.
ఈసారి మరో అడుగు ముందుకేసి.. కేటీఆర్ నా జీవితాన్ని నాశనం చేశాడంటూ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ఆరోపణలు చేసినట్లు ఓ ఫేక్ పోస్టర్ క్రియేట్ చేసి వదిలారు. అందులో రకుల్ సీరియస్ లుక్‌లో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్లుగా ఉంది. ఆ పక్కనే కేటీఆర్, ఆయనకు చెందిన జన్వాడ ఫాంహౌస్‌లు పెట్టి ఫోటో డిజైన్ చేసి షేర్ చేశారు. దీనికి సంబంధించి నిజానిజాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ విషయమై బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా.. కేటీఆర్‌కు సంబంధించిన జన్వాడ ఫాంహౌస్ తెరపైకి వచ్చింది. ఈ ఇష్యూలోకి రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకొచ్చి.. ఆమె మాట్లాడినట్లుగా ఫేక్ స్టేట్‌మెంట్‌ని జత చేసి తద్వారా ఇద్దరిపై బురద జల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. వ్యూస్, డబ్బుల కోసం రెండు కుటుంబాలను బజారుకీ ఈడ్చి పబ్బం గడపుకోవాలని చూస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో .. దీని వెనుక ఉన్న వారిని బయటికి లాగేందుకు బీఆర్ఎస్ వర్గాలు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











