ఎన్టీఆర్ ‘శక్తి’ మూవీకి విలన్ ఆయనేనా? డిజాస్టర్ కారణం అతడేనా?
తెలుగు సినిమా దగ్గర కొన్ని ఎపిక్ డిజాస్టర్ సినిమాల లిస్ట్ ప్రస్తావన వస్తే వాటిలో ఖచ్చితంగా కనిపించే సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన "శక్తి" సినిమా కూడా ఒకటి. కాగా ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పుడు అడిగినా కూడా తనకి ఆ సినిమా ఒక పీడ కల లాంటిది అని దయచేసి ఆ సినిమా కోసం మాత్రం అడగొద్దు అని తారక్ దాటవేసేస్తాడు. ఆ రేంజ్ లో ఈ సినిమా ఎన్టీఆర్ కి చేదు జ్ఞ్యాపకాలు మిగిల్చింది.
కాగా ఎన్టీఆర్ కెరీర్లోనే కాకుండా తనకి సహా దర్శకుడు మెహర్ రమేష్ అలానే నిర్మాత అశ్విని దత్ లకి కూడా ఈ సినిమా ఒక నైట్ మేర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇదే ఏప్రిల్ నెల 1న గత 2011లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది కానీ డే 1 షోస్ పడ్డాక ఈ చిత్రం భారీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే మగధీర సినిమా తర్వాత 40 కోట్ల మేర బడ్జెట్ ఈ సినిమాకి అయ్యింది.

కాగా శక్తి సినిమా అంటే ఒక ఎమోషన్ అని కూడా తెలుగు ఆడియెన్స్ విషయంలో చెప్పవచ్చు. అనేక ట్రోల్స్ ఈ సినిమాపై సహా మెయిన్ గా ఎక్కువ డ్యామేజ్ ఎదుర్కొంది మాత్రం దర్శకుడు మెహర్ రమేష్ అని చెప్పాలి. కాగా మెహర్ రమేష్ కి ఈ సినిమాలో ఎన్నో ట్రోల్స్ ఇప్పటికీ పడుతూ ఉంటాయి. ఇలా వాటిని ఎదుర్కుంటూ వచ్చిన మెహర్ అనే ఈ సినిమా పాలిట మెయిన్ విలన్ అని ప్రచారం ఇన్నేళ్లు జరిగింది.
కానీ ఇపుడు శక్తి సినిమా విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. నిజానికి తాను ఎన్టీఆర్ తో అనుకున్న సినిమా ఇది కాదు అని మెహర్ చెప్పిన మాటలు షాకిచ్చాయి. ఎన్టీఆర్ ని ఒక గైడ్ గా వేరే సినిమా ప్లాన్ చేసుకున్నాను కానీ ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ని మాత్రం జోడించడానికి కారణం నిర్మాత అశ్విని దత్ అంటూ షాకింగ్ ట్విస్ట్ ని మెహర్ రివీల్ చేయడం జరిగింది.
కాగా అప్పట్లో శక్తి సినిమా సహా మరికొన్ని సినిమాలు రామ్ చరణ్, రాజమౌళిల మగధీర సినిమా ప్రభావంతోనే వచ్చాయి అనే ఓ టాక్ ఉంది. కాగా శక్తి సినిమా మాత్రం మగధీర చూసే వచ్చింది అని కూడా మెహర్ తెలిపారు. ఆ సినిమా చూసి ఆ తరహాలోనే ఒక సినిమా చేయాలని అశ్వినీదత్ శక్తి సినిమాలో చాలా మార్పులు చేయించుకున్నారని ఆయనికి మొదటి నుంచీ ఆ తరహా ఫాంటసీ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పడం ఎన్టీఆర్ అభిమానులకి సైతం ఇపుడు షాకింగ్ గా మారింది.
దీనితో ఇన్ని రోజులు శక్తి రిజల్ట్ కి కారణం ఒక్క మెహర్ రమేష్ అని అంతా అనుకున్నామని కానీ ఇపుడే తెలిసింది దీని వెనుక అసలు కారణం నిర్మాత అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కాగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై అప్పట్లో ఎన్నో అంచనాలు కూడా పెట్టుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాకి తాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ నుంచి ఏ 1 స్టార్ అనే ట్యాగ్ కూడా మార్చుకోవడం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే ఏదో అవుతుంది అనుకున్న ఈ సినిమా ఘోరంగా విఫలం అయ్యి ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే కాకుండా తన అభిమానులకి కూడా పీడకల గానే మిగిలిపోయింది.


Click it and Unblock the Notifications











