సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక షాకింగ్ విషయం.. రెండో భర్త ఫోన్ సీజ్‌తో బలపడిన అనుమానం?
ప్రముఖ సింగర్ కల్పనా రాఘవేంద్ర ఆత్మహత్యాహత్నం ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పనా రాఘవేంద్ర ఆరోగ్యం మాత్రం కాస్తా విషమంగానే ఉందని అంటున్నారు. అయితే కల్పనా బలవన్మరణానికి పాల్పడానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. అప్పులు, పిల్లల విషయంలో ఎదురైన ఘటనలు అంటూ ప్రచారం కొనసాగుతోంది. కానీ స్పష్టమైన కారణం తెలియడం లేదు.
పోలీసులు మాత్రం ఆధారాలు సేకరించి... కల్పనా సూసైడ్ అటెంప్ట్ కు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కల్పనాకు నిజాంపేట్ లోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, స్టార్ సింగర్స్ ఆస్పత్రిలోనే ఉండి ఆమె హెల్త్ అప్డేట్స్ ను తెలుసుకుంటున్నారు. కల్పనా సూసైడ్ అటెంప్ట్ గురించి రెండో భర్త ప్రసాద్ కు కూడా తెలియజేశారు. దీంతో చెన్నై నుంచి ఆయన కూడా బయల్దేరి వచ్చారు. మరోవైపు పోలీసులు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణను వేగవంతం చేశారు.

కల్పనా 2010లో తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చెన్నైకి చెందిన వ్యాపార వేత్త ప్రసాద్ ప్రభాకర్ ను రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరూ ఐదేళ్లుగా కలిసే ఉంటున్నారు. అయితే భర్త ప్రసాద్ కు తనకు మధ్య ఏదైనా వివాదం వల్లే కల్పనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా? అనే చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో భర్త ప్రసాద్ అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం కల్పనా రెండో భర్తను అనుమానిస్తూ ఆయన ఫోన్ ను సీజ్ చేశారు.
ఇక కల్పనా హైదరాబాద్ లోని నిజాంపేట్ లో గల ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఆమె నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా కల్పనా ఇంట్లో నుంచి బయటకి రావడం లేదు... అనుమానం వచ్చిన చుట్టుపక్కన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్నఅధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే నిద్రమాత్రలు మింగి కల్పనా సూసైడ్ అటెంప్ట్ చేయాలని భావించింది. అతిగా స్లీపింగ్ పిల్స్ మింగేసింది. దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
దక్షిణాది భాషల్లో కల్పనా రాఘవేంద్ర ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. సంగీత కుటుంబంలోనే పుట్టిన ఆమె ఐదేళ్ల నుంచే గాయనిగా మారింది. 2013 వరకే ఆమె 1500 పాటలు పాడారు. 1991 నుంచి తెలుగు, తమిళ భాషల్లో రికార్డు స్థాయిలో పాటు పాడి సంగీత ప్రియులను అలరించింది. చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో చిత్రాల పాటలకు తన గాత్రాన్ని అందించింది. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు 3000 వరకు సంగీత ప్రదర్శనలు చేసింది. ఇండస్ట్రీలో ఆమెకు మంచి గౌరవం ఉంది. ఎప్పుడూ తన సమస్యలను బయటికి రానివ్వని కల్పనా.. ఉన్నట్టుండి సూసైడ్ అటెంప్ట్ చేయడం షాకింగ్ గా ఉంది.


Click it and Unblock the Notifications











