Fahadh లుక్ మీద లెక్క లేనన్ని ట్రోల్స్.. ఇంత చిన్న లాజిక్ సుక్కూ ఎలా మిస్సయ్యాడబ్బా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. అలవైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా మీద సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ ఎప్పటికప్పుడు సినిమా నుంచి అనేక రకమైన అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా నిన్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ముంచు నుంచే అంచనాలు

ముంచు నుంచే అంచనాలు

ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో సినిమాగా పుష్ప ప్రారంభించారు. ఈ సినిమా ప్రకటించినపుడు అంచనాలు ఏర్పడగా ఆ అంచనాలను అంతకుమించి ఎలా ఈ సినిమా నుంచి ఒక్క వార్త బయటకు వస్తుంటే ప్రేక్షకులతో సహా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కూడా ఒక రకమైన ఆసక్తి పెరుగుతుంది. మొట్ట మొదటి సారిగా అల్లు అర్జున్ ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో ఆయన పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తూ ఉండగా ఇందులో స్మగ్లర్ గా ఆయన పాత్ర ఉండబోతోందని అంటున్నారు. ఇది ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్నా కూడా మంచి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు అని అంటున్నారు.

పెద్ద సంఖ్యలో ట్రోల్స్

పెద్ద సంఖ్యలో ట్రోల్స్

ఈ సినిమా ప్రకటించినప్పుడే ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఎలాగూ తమిళ, తెలుగు, మలయాళ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ మరింత పెరిగేలా మలయాళం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉన్న ఫహాద్ ఫాజిల్ ని ఈ సినిమాలో ఒక నెగిటివ్ పాత్ర కోసం తీసుకు వచ్చామని చెప్పారు.

ముందు నుంచి కూడా ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు అనేక అంచనాలు పెట్టుకోగా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నిన్న ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు గానీ విడుదల చేసినప్పటి నుంచి ఆ ఫస్ట్ లుక్ మీద అనేక ట్రోల్స్ నడుస్తున్నాయి..

మెల్లకన్ను

మెల్లకన్ను

ఎందుకంటే నిన్న విడుదల చేసిన లుక్ లో ఆయన గుండు తో కనిపిస్తున్నారు. ఒక రకంగా దీనివల్ల ట్రోలింగ్ మొదలైందని చెప్పవచ్చు. నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రకారం సినిమాలో ఆయన ఐపీఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ అధికారిగా ఆయన స్మగ్లింగ్ ను అరికట్టే పనిలో ఉన్నట్లు గా చూపిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆయన కళ్ల గురించి కూడా ప్రత్యేక చర్చ జరుగుతోంది. అందులో ఆయన మెల్లకన్నుతో ఉన్నట్టు చూపించారు. ఒక కన్ను నిన్ను చూస్తూ ఉంటే ఒక కన్ను నన్ను చూస్తోంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ సుకుమార్ మిస్ అయినట్లు అనిపిస్తోంది.

చిన్న లాజిక్ మిస్సయిన సుకుమార్ మిస్

చిన్న లాజిక్ మిస్సయిన సుకుమార్ మిస్

ఎందుకంటే ఐపీఎస్ అధికారి అంటే సివిల్స్ ఎగ్జామ్ పూర్తిచేసి ఇంటర్వ్యూ అలాగే ఆ తర్వాత దేహదారుడ్యానికి సంబంధించిన టెస్టులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మెల్లకన్ను ఉన్న వ్యక్తికి ఐపీఎస్ పోస్ట్ రావడం అనేది అసాధ్యం అని చెబుతున్నారు. మరి సినిమాలో మాత్రం ఐ.పి.ఎస్ అధికారి పాత్రలో నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ కి మెల్లకన్ను ఉన్నట్లు చూపించారు.

అయితే మరికొందరు మాత్రం అది మెల్లకన్ను లాగా అనిపించడం లేదని ఒక కన్ను పూర్తిగా కనిపించకపోతూ ఉండొచ్చు అని అంటున్నారు. ఒకవేళ అలా అనే తీసుకున్నా ఒక కన్నుతో ఉన్న వ్యక్తి ఐపీఎస్ అధికారి కావడం అనేది అసాధ్యం. మరి ఈ విషయంలో సుకుమార్ లాజిక్ మిస్ అయ్యాడా? లేక దానిని కూడా లాజికల్గా సినిమాలో ప్రూవ్ చేస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే సుకుమార్ ఇప్పటిదాకా లాజిక్స్ విషయంలో ఎక్కడా ఫెయిల్ అయిన దాఖలాలు లేవు.

వీళ్ళే గుర్తొస్తున్నారు

వీళ్ళే గుర్తొస్తున్నారు

ఇక ఫాజిల్ గుండు విషయంలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా హ్యాపీ సినిమాలో పోలీస్ అధికారితో పోలుస్తూ అలాగే నిర్మాత డి.ఎస్.రావుతో కూడా ఆయనను పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు రమణ గోగులతో పోలుస్తూ ఉంటే ఇంకొందరు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ రామ్ జగన్ తో పోలుస్తూ నిన్ను చూడగానే వీళ్ళే గుర్తొస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Recommended Video

Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Filmibeat Telugu
క్రిస్మస్ సందర్భంగా

క్రిస్మస్ సందర్భంగా

కానీ సుకుమార్ లెక్క మాత్రం మామూలుగా ఉండదని లుక్ లోనే ఇలా కనిపిస్తున్నాడు అంటే సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి బెదిరిపోవడం ఖాయమని అంటున్నారు మరికొంతమంది. మరి సినిమా విడుదల అయ్యే వరకూ ఈ లాజిక్స్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది అని మాత్రం చెప్పక తప్పదు.

ఇక ఈ సినిమాలో సునీల్, అనసూయ, అజయ్ లాంటి వాళ్లు కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వారికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ లాంటివి విడుదల చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X