Pushpa 2: పుష్ప నుంచి ఇంకో క్రేజీ లీక్.. అల్లు అర్జున్‌తో సమానంగా ఆ హీరో కూడా!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో సీక్వెల్ మూవీలు ఎక్కువ అయ్యాయి. ఏదైనా హిట్ సినిమాను కొనసాగించడానికి అవకాశం ఉన్నా.. రెండు పార్టులుగా తీసేంత కంటెంట్ ఉన్నా.. దర్శకులు, హీరోలు ఏమాత్రం ఆగడం లేదు. అలా టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి.
ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొంది పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయిన 'పుష్ప ది రైజ్'కు ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. 'పుష్ప ది రూల్' పేరిట రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఫస్ట్ పార్ట్ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. 'పుష్ప ది రూల్'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటోంది. ఇలా ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిపిన షెడ్యూళ్లలో చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు.
త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో యూనిట్ సభ్యులు చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
భన్వర్ సింగ్ శెకావత్‌కు పుష్పరాజ్ ధమ్కీ ఇచ్చే సీన్‌తో సుకుమార్ మొదటి పార్టును పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెరకెక్కుతోన్న 'పుష్ప ద రూల్' మూవీలో వీళ్లిద్దరి మధ్య శత్రుత్వాన్ని మరింత హైలైట్ చేయబోతున్నాడట. అంతేకాదు, అల్లు అర్జున్‌తో సమానంగా ఫహాద్ ఫాజిల్‌కు కూడా స్క్రీన్ స్పేస్ ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది.

ఇక, వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు హై రేంజ్‌లో ఉండబోతున్నాయని తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ స్పష్టం చేశాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఇక.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చే 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సునీల్, అనసూయ, జగదీష్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











