twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్‌ సునీత‌పై అసత్య కథనాలు.. మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు

    |

    కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో తనపై అసత్య కథనాలు వెల్లడించడంపై సింగర్ సునీత భగ్గుమన్నారు. కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన కథనాలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సింగర్ సునీతపై వచ్చిన అసత్య కథనాలు ఏమిటంటే..

    తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ భయాలు

    తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ భయాలు

    తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనావైరస్ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాధి ఇంకా ప్రబలకుండా ప్రజలను వీధుల్లోకి రాకుండా కట్టడి చేస్తున్నారు. వ్యాధిని అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలను అధికారులు, పోలీస్ శాఖ చేస్తున్నది. ఈ మేరకు మార్చి 31వ తారీఖు వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.

     సింగర్ సునీత ఫోటోపెట్టి

    సింగర్ సునీత ఫోటోపెట్టి

    ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సింగర్ సునీతకు కరోనా వ్యాధి సోకిందంటూ వార్తలు వచ్చాయి. సునీత ఫోటోను బ్లర్ చేసి అసత్య కథనాన్ని ప్రచురించారు. ఈ విషయం సింగర్ సునీత దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించిన సోషల్ మీడియా అకౌంట్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.

    ఆ వార్తకు సంబంధం లేకున్నా..

    ఆ వార్తకు సంబంధం లేకున్నా..

    చందమామ కథలు ఫేస్‌బుక్ పేజ్ నా ఫోటోను థంబ్ నైల్‌గా పెట్టి ఓ వార్తను పోస్టు చేశారు. వాస్తవానికి ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగర్ కనికాకు కరోనా వార్త అయితే నా ఫోటోను పెట్టారు. ఇది చాలా దారుణం. ఇలా మరొకరికి జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో స్పందించారు.

    Recommended Video

    Ghantasala Biography || ఘంటసాల సినీ జీవిత విశేషాలు
    నా ఆరోగ్యం బాగానే ఉంది

    నా ఆరోగ్యం బాగానే ఉంది

    నా ఆరోగ్యం బాగానే ఉంది. నాకు ఎలాంటి వ్యాధి సోకలేదు అంటూ మంత్రి కేటీఆర్‌కు సునీత ఆ వార్తను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎంకు, ఇతర అకౌంట్లకు ట్యాగ్ చేశారు. కేటీఆర్ సార్. ప్లీజ్ హెల్ప్ మీ అంటూ సునీత అభ్యర్థించారు.

    English summary
    A Fake Coronavirus story on Singer Sunitha goes viral. In This occassion, She Complaints to Minister KTR to do justice in this regards. Sunitha requested to help out this crisis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X