twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో కలకలం.. నటికి టాప్ డైరెక్టర్ పేరుతో మెసేజ్..ఒకరోజు గడిపితే నువ్వే హీరోయిన్ అంటూ!

    |

    దాదాపు అన్ని భాషల్లో సినిమా పరిశ్రమల్లో కూడా ఈ లైంగిక వేధింపులు అనే అంశం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి తమ లైంగికంగా వేధించారు అని కొన్ని ఆరోపణలు చేయడం ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం ఆ తర్వాత అసలు ఆ విషయాలు ఏమవుతుందో కూడా బయటకు తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఒక దర్శకుడు తనకు ఎవరూ ఊహించని విధంగా పడుకోమని అంటూ ఆఫర్ చేసినట్లు ఒక టాలీవుడ్ నటి ఆరోపించింది. ఆ వివరాల్లోకి వెళితే

    డైరెక్టర్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్

    డైరెక్టర్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్

    నిజానికి టాలీవుడ్ అంటే అందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే అనుకుంటారు కానీ బెంగాలీ సినీ పరిశ్రమను కూడా టాలీవుడ్ అనే సంబోధిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం బెంగాల్ టాలీవుడ్ కు సంబంధించిన ఒక టీవీ నటి చేసిన ఫిర్యాదు గురించి. బెంగాలీ టెలివిజన్ నటి పాయల్ సర్కార్ కు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రవి కినాగి యొక్క నకిలీ ప్రొఫైల్ నుండి ఒక రాత్రి గడపడానికి ఆఫర్ వచ్చింది. శనివారం ఉదయం రవి కినాగి అనే ప్రొఫైల్ నుంచి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని పాయల్ సర్కార్ ఆరోపించారు. పాయల్ ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించింది.

    సంభాషణలో

    సంభాషణలో

    దీంతో మెసెంజర్‌ లో సంభాషణ ప్రారంభమైంది. నకిలీ ప్రొఫైల్ వెనుక ఉన్న వ్యక్తి పాయల్ కి ఆఫర్లు ఇచ్చాడు. ఆఫర్‌ని ఇచ్చిన తర్వాత పాయల్ ను తనతో ఒక రాత్రి గడపమని నేరుగా అడిగాడు. ఇంత అసభ్యకరమైన విషయం చూసి ఆమె ఆశ్చర్యపోయింది మరియు ఆ తర్వాత ఆమె ఏమీ మాట్లాడలేదు. తరువాత, పాయల్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో సంభాషణ యొక్క స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది, దాని గురించి ఒకదాని తర్వాత ఒకటిగా వ్యాఖ్యలు రావడం ప్రారంభమైంది. దీంతో మెసెంజర్ స్క్రీన్‌షాట్‌లతో పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు

    పాయల్ సర్కార్ మెయిల్ ద్వారా సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ, నటి శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫేస్‌బుక్‌లో రవి కినాగి అనే ఫేస్‌బుక్ ప్రొఫైల్ నుండి తనకు సందేశం పంపబడిందని ఆ సమయంలో అతను తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడని పేర్కొన్నారు. ఒక ప్రముఖ దర్శకుడి నుండి ఈ ఆఫర్ అందుకున్నందుకు పాయల్ సహజంగా సంతోషించిందట. అసలు ఆ ఆఫర్ వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు, తనతో రాత్రి గడపమని కోరారట. దీంతో ఆమె మెయిల్ ద్వారా సైబర్ సెల్‌కు ఆ చాట్ యొక్క స్క్రీన్ షాట్‌ను కూడా పంపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులు బ్యారక్‌పూర్ పోలీస్ కమిషనరేట్ సహాయాన్ని తీసుకుంటున్నారు.దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులు బ్యారక్‌పూర్ పోలీస్ కమిషనరేట్ సహాయాన్ని తీసుకుంటున్నారు.

    బీజేపీ నుంచి పోటీ

    బీజేపీ నుంచి పోటీ

    పాయల్ మాట్లాడుతూ 'నేను మొదట ప్రొఫైల్‌ని గమనించలేదు. అదే చేసి ఉంటే బహుశా ఈ సంఘటన జరిగి ఉండకపోవచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుండి ప్రొఫైల్ డీయాక్టివేట్ చేయబడింది. అయితే, IP చిరునామా కనుగొనబడిందని పోలీసులు చెప్పారని ఆమె పేర్కొంది. నిజానికి పాయల్ ఒక ప్రముఖ వ్యక్తి నుండి అలాంటి ఆఫర్ వచ్చినందుకు సహజంగా సంతోషించింది, కానీ ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు అడిగినప్పుడు, ఇలా దారుణంగా నైట్ గడపమని కోరారు. పాయల్ 'ఐ లవ్ యు', 'ప్రేమ్ అమర్' వంటి అనేక సూపర్ హిట్ బెంగాలీ చిత్రాలలో పని చేయడం గమనార్హం. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి టికెట్‌పై పోటీ చేసింది, అందులో ఆమె ఓడిపోయారు.

    Recommended Video

    Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Filmibeat Telugu
    డైరెక్టర్ రవి కినాగిని

    డైరెక్టర్ రవి కినాగిని

    ఈ విషయంలో డైరెక్టర్ రవి కినాగిని సంప్రదించగా "నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను" అని ఆయన చెప్పారు. నా కుటుంబానికి దగ్గరి బంధువు చనిపోయారని, ఈ వార్త విన్నానని అది తన ప్రొఫైల్ కాదని పేర్కొన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ నేను ప్రతి ఒక్కరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, సోషల్ మీడియా అనేది ఒక ఆఫర్ పొందడానికి అనువైన వేదిక కాదు. నేరుగా మాట్లాడాలి. కొంతమంది నిజాయితీ లేని వ్యక్తులు ప్రజల నిస్సహాయత మరియు అజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, మరియు మనలాంటి వ్యక్తులు దాని పర్యవసానాలను అనుభవిస్తున్నారు. ఇది ఆపాలని ఆయన కోరారు.

    ఇంకా మాట్లాడుతూ 'నేను సోషల్ మీడియాను అస్సలు ఉపయోగించను. చాలా సంవత్సరాల తరువాత దిలీప్ సాహెబ్ మరణించిన తర్వాత నేను ఒక చిత్రాన్ని పోస్ట్ చేసాను. ఎందుకంటే అతను మా కుటుంబానికి చాలా సన్నిహితుడు అని అన్నారు. ఇక ఈ విషయంలో నేను చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానన్న ఆయన నేను కూడా సైబర్ పోలీసులను కూడా సంప్రదించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మీరు ప్రొఫైల్‌ని మూసివేసినప్పటికీ, కొందరు వ్యక్తులు దాన్ని మళ్లీ తెరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నేను సూచిస్తున్నానని అన్నారు. ఇక ఇలాంటి విషయాల్లో నిజంగా వారి తప్పు లేకున్నా ఇలా చిక్కుల్లో పడాల్సి రావడం గమనార్హం.

    Read more about: ravi kinagi payel sarkar
    English summary
    Fake ID on the name of director Ravi Kinagi made Bad proposal to actress Payel Sarkar of bengali tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X