సునీల్ దుర్మరణం అంటూ వార్తలు.. స్పందించిన హీరో, ఏం జరిగిందంటే!

Recommended Video

Actor Sunil Responded On Rumours About Him || Filmibeat Telugu

టాలీవుడ్ లో కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారాడు. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేకపోవడంతో సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో కమెడియన్ గా సునీల్ అదరగొట్టేశాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించిన సంగతి తెలిసిందే. హీరోగా సునీల్ కు మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు దక్కాయి. తాజాగా సునీల్ గురించి ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడు స్పందించాడు.

సునీల్ దుర్మరణం అంటూ

సునీల్ దుర్మరణం అంటూ

టాలీవుడ్ హీరో సునీల్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు అంటూ ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఈ ఫేక్ న్యూస్ చూసి చాలా మంది షాక్ కి గురయ్యారు. నిజంగానే ఈ ప్రమాదం జరిగిందా అని ఆరా తీశారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ గందరగోళంగా ఓ పోస్ట్ తయారు చేసి సోషల్ మీడియాలోకి వదలడంతో అది వైరల్ అయింది. దీనిపై తాజాగా హీరో సునీల్ స్పందించాడు.

నమ్మకండి

సునీల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇలాంటి గాలి వార్తలు నమ్మకండి. నేను బాగానే ఉన్నాను. ఇలాంటి రాతల్ని ఎవరూ విశ్వసించవద్దు అని సునీల్ కోరాడు. సునీల్ ట్వీట్ చేస్తూ ఆ ఫేక్ న్యూస్ కి సంబంధించిన ఫోటోని పెట్టాడు. గతంలో చాలా మంది నటులు ఇలాంటి ఫేక్ న్యూస్ బారీన పడిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ కు ఏదో జరిగిపోయింది.. ఆ హీరో ప్రమాదానికి గురయ్యాడు అంటూ పలు నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.

 క్యారెక్టర్ ఆర్టిస్టుగా

క్యారెక్టర్ ఆర్టిస్టుగా

చాలా కాలంగా సునీల్ హీరోగా నటించిన చిత్రాలు విజయం సాధించడం లేదు. దీనితో సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాల్లో సునీల్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సునీల్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రలహరి చిత్రంలో మరో కీలక పాత్ర చేస్తున్నాడు.

త్రివిక్రమ్ చిత్రాల్లో

త్రివిక్రమ్ చిత్రాల్లో

సునీల్ ఎక్కువగా త్రివిక్రమ్ చిత్రాలలో కనిపిస్తుంటారు. వీరిద్దరూ మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. సునీల్ కు పూలరంగడు చిత్రంతో హీరోగా మంచి హిట్ లభించింది. ఆ తర్వాత నటించిన భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, ఉంగరాల రాంబాబు లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో అరవింద సమేత చిత్రం నుంచి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X