నాని సినిమా ఓటీటీ రిలీజ్.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేశారు!
నేచురల్ స్టార్ నాని చివరగా చేసిన V సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ఎన్నో నెలల పాటు ఎదురుచూసిన నిర్మాత దిల్ రాజు చివరికి థియేటర్స్ తెరచుకునే అవకాశం లేదని ఓటీటీ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆ సినిమా అనంతరం నానికి సంబంధించిన మరొక సినిమా కూడా ఓటీటీలోనే రానున్నట్లు టాక్ వచ్చింది.
శివ నిర్వణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక అభిమానులు కన్ఫ్యూజన్ కు గురవుతున్న సమయంలో చిత్ర యూనిట్ ను సంప్రధించగా అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే ఈ ఎడాది సమ్మర్ లోనే హ్యాపీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. గ్రాండ్ గా ఒక ఈవెంట్ తో సినిమా ప్రమోషన్ డోస్ పెంచాలని కూడా అనుకున్నారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్ళీ సైలెంట్ అవ్వక తప్పలేదు. నాని ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదట. అయితే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదని అర్ధమవుతోంది.
ఒకవేళ ఓపెన్ అయినా కూడా గతంలో మాదిరిగా థియేట్రికల్ బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఏడాది మొత్తం సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవచ్చని తెలుస్తోంది. మరి టక్ జగదీష్ టీమ్ ఏ స్థాయిలో ఓపిక పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











