twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SP.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఫేక్ న్యూస్... ఇంకా పరిస్థితి ప్రమాధకరంగానే ఉంది: తనయుడు SP చరణ్

    |

    సంగీత ప్రియులను గత కొన్నిరోజులుగా SP.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఈ గాన గంధర్వుడు కరోనాతో పోరాడి జయించారని కొద్దీ సేపటి క్రితమే కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని మళ్ళీ ఆయన తనయుడు చరణ్ వివరణ ఇచ్చారు. పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని, ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నట్లు చెప్పారు. నేడు నిర్వహించిన కోవిడ్ టెస్టులో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు అధికారిక ప్రకటన వెలువడినట్లు న్యూస్ రావడంతో అభిమానులు సినీ ప్రముఖులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది అబద్ధం అని తేలింది.

    Recommended Video

    #LetsPrayForSPB: ఈ గ్లోబ్ లో SP Balasubrahmanyam లాంటివారు న భూతొ న భవిష్యతి !
    కేవలం కొద్దిపాటి లక్షణాలతో

    కేవలం కొద్దిపాటి లక్షణాలతో

    ఈ నెల 5వ తేదీన బాలసుబ్రహ్మణ్యం తనకు కరోనా ఉందని ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో కేవలం కొద్దిపాటి లక్షణాలతో జలుబు ఉన్నట్లు వివరణ ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం ఆ తరువాత రోజురోజుకి అనారోగ్యం తీవ్రత పెరిగింది. హైదరాబాద్ నుంచి ఆయనను వెంటనే చెన్నైకి తరలించి MGM హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

    కరోనా ఎలా వచ్చింది అంటే..

    కరోనా ఎలా వచ్చింది అంటే..

    అప్పుడప్పుడు మ్యూజిక్ ఈవెంట్స్ లలో పాల్గొనే SP.బాలసుబ్రహ్మణ్యం చాలా రోజుల తరువాత గత నెల 30న మ్యూజిక్ ఈవెంట్ కి వెళ్లారు. అందులో తెలుగు సింగర్స్ చాలా మంది పాల్గొన్నారు. ఆ వేడుక నుంచి వచ్చిన తరువాతే ఆయన అస్వస్థతకు గురయ్యారు.

     మొదట ఇంటి వద్దనే..

    మొదట ఇంటి వద్దనే..

    వైద్యులు మొదట ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుందని బాలసుబ్రహ్మణ్యంకు వివరణ ఇచ్చారు. కానీ ఆయన రిస్క్ చేయలేనని వైరస్ నుంచి పూర్తిగా బయటపడేంత వరకు ఇక్కడే రెస్ట్ తీసుకుంటానని చెప్పినట్లు మొదట రిలీజ్ చేసిన వీడియోలో వివరణ ఇచ్చారు. బాలు గారు మంచి నిర్ణయం తీసుకున్నారని ఆ తరువాత అందరికి అర్ధమయ్యింది.

    పరిస్థితి రోజురోజుకి విషమించడంతో..

    పరిస్థితి రోజురోజుకి విషమించడంతో..

    ఇక పరిస్థితి రోజురోజుకి విషమించడంతో వారం రోజులుగా ఎక్మో, వెంటిలేటర్ పరికరాల సహాయంతో బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స అందిస్తున్నారు. మొన్నటివరకు ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉన్నట్లు తనయుడు చరణ్ వివరణ ఇచ్చారు. అప్పుడు చాలా మంది సినీ సెలబ్రెటీస్ కూడా బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

    లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్స్..

    లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్స్..

    ఇక నేడు ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పూర్తిగా నెగటివ్ గా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని చరణ్ వివరణ ఇచ్చారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు SP చరణ్ మరోసారి ఇచ్చిన వివరణ బాలు అభిమానులను మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. త్వరలోనే మళ్ళీ మరో అప్డేట్ ఇస్తానని కూడా తెలియజేశారు.

    English summary
    sp balasubrahmanyam health condition has been a matter of grave concern to music lovers for the past few days. All in all, however, the singing Gandharva fought and conquered Corona. Fans and celebrities were left breathless after the official announcement that he got a negative in the covid test conducted today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X