ఆచార్యలో రామ్ చరణ్ రోల్.. ఆ వార్తలన్నీ అబద్ధాలే..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి తన తండ్రి మెగాస్టార్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుందా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఏదురుచూస్తున్నారు. అయితే ఆ పాత్రకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడని, ఆ పాత్ర కోసం డైరెక్టర్ రాజమౌళిని స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ పాత్ర కోసం చరణ్ కొత్త లుక్ కోసం బరువు తగ్గడాని, అంతకుముందు RRR కోసం సెట్ చేసుకున్న బాడీని కూడా మార్చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఇటీవల మెగా కాంపౌండ్ నుంచి స్పెషల్ గా అందిన సమాచారం ప్రకారం అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది.

RRR కోసం రెడీ చేసుకున్న ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం మార్పులు ఉండవట. కేవలం ఫేస్, హెయిర్ స్టైల్ ని మేకప్ తో సరికొత్తగా చూపించనున్నారట. అంతే గాని ఫిట్నెస్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలిసింది. ఇక నేడు RRR టెస్ట్ షూట్ మొదలయ్యింది.
దర్శకుడు రాజమౌళి కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సినిమాకు సంబంధించిన సీన్స్ విషయం గురించి చర్చించడానికి లొకేషన్ స్పాట్ కి వెళ్లడం జరిగింది. ఇక రెండు రోజుల తరువాత ఈ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ రెగ్యులర్ గా పాల్గొనబోతున్నాడు. ఇక ఆ తరువాత ఆచార్య షూటింగ్ అయిపోగానే రామ్ చరణ్ తారక్ తో కలవనున్నాడు.


Click it and Unblock the Notifications











