twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీమెన్ సీజన్ 2 వాయిదా.. కారణం అదే

    |

    ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దేశ ప్రజలను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ గురించి దేశమంతా చర్చ జరిగింది. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కూడా ఫ్యామిలీమెన్ గురించి మాట్లాడుకున్నాయి. అంతలా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ సీజన్‌ 2ను ఇంకెంత భారీ స్థాయిలో తెరకెక్కించి ఉంటారో ఊహించుకోవచ్చు. అలా ఈ రెండో సీజన్‌లో సమంతను స్పెషల్ అట్రాక్షన్‌గా తీసుకున్నారు.

    ఆ మధ్య రిలీజ్ చేసిన ఫ్యామిలీ మెన్ సీజన్ 2 టీజర్‌ అదిరిపోయింది. మామూలుగా ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేశారు. టీం మొత్తం ముంబైలో రచ్చ చేసింది. టీజర్ చివర్లో సమంత అలా ఒక్క షాట్‌లోనే కనిపిస్తుంది. కానీ అందరి దృష్టిని మాత్రం తన వైపుకు తిప్పుకుంది. ఇక ట్రైలర్ కూడా విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచుతారని అంతా భావించారు.

     Family man season 2 pushed to 2021 summer

    కానీ అంతలోపే ఇలా షాకింగ్ న్యూస్ చెప్పారు. సీజన్ 2ను సమ్మర్‌కు వాయిదా వేసినట్టు ప్రకటించారు. సినిమాను మరింత ఎఫెక్టివ్‌గా తీర్చి దిద్దడానికే ఇలా చేశామని, మంచి అనుభూతిని కలిగించేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. సమ్మర్‌లో సీజన్ 2 రాబోతోందని, కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. మొత్తానికి సీజన్ 2 ఫిబ్రవరిలో వస్తుందని ఆశపడ్డ అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

    English summary
    Family man season 2 pushed to 2021 summer,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X