Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఫ్యామిలీమెన్ సీజన్ 2 వాయిదా.. కారణం అదే
ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దేశ ప్రజలను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ గురించి దేశమంతా చర్చ జరిగింది. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కూడా ఫ్యామిలీమెన్ గురించి మాట్లాడుకున్నాయి. అంతలా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ సీజన్ 2ను ఇంకెంత భారీ స్థాయిలో తెరకెక్కించి ఉంటారో ఊహించుకోవచ్చు. అలా ఈ రెండో సీజన్లో సమంతను స్పెషల్ అట్రాక్షన్‌గా తీసుకున్నారు.
ఆ మధ్య రిలీజ్ చేసిన ఫ్యామిలీ మెన్ సీజన్ 2 టీజర్ అదిరిపోయింది. మామూలుగా ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేశారు. టీం మొత్తం ముంబైలో రచ్చ చేసింది. టీజర్ చివర్లో సమంత అలా ఒక్క షాట్‌లోనే కనిపిస్తుంది. కానీ అందరి దృష్టిని మాత్రం తన వైపుకు తిప్పుకుంది. ఇక ట్రైలర్ కూడా విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచుతారని అంతా భావించారు.
కానీ అంతలోపే ఇలా షాకింగ్ న్యూస్ చెప్పారు. సీజన్ 2ను సమ్మర్‌కు వాయిదా వేసినట్టు ప్రకటించారు. సినిమాను మరింత ఎఫెక్టివ్‌గా తీర్చి దిద్దడానికే ఇలా చేశామని, మంచి అనుభూతిని కలిగించేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. సమ్మర్లో సీజన్ 2 రాబోతోందని, కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. మొత్తానికి సీజన్ 2 ఫిబ్రవరిలో వస్తుందని ఆశపడ్డ అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.