ఫ్యామిలీ స్టార్, మంజుమ్మల్ బాయ్స్ సహా మరో 3 చిత్రాలు థియేటర్లలోకి.. కచ్చితంగా చూడాల్సినవి మాత్రం!
ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభం అయిందో లేదో అనేక కొత్త సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రతీ వారం సరికొత్త చిత్రాలు వస్తూ... సినీ ప్రియులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటున్నాయి. ఇటీవలే అనేక సినిమాలు థియేటర్లలో విడుదల అయి సందడి చేయగా.. తాజాగా మరికొన్ని కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ వారం.. ఫ్యామిలీ స్టార్, మంజుమ్మల్ బాయ్స్ సహా మరో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏవి, అందులో కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా సినిమానే ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గోపి సుందర్ సంగీతం ఈ సినిమాకు అందిస్తుండగా.. కె యు మోహనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నమోదు అయిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. అంటే రేపే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇటీవలే వచ్చి మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టడంతో తెలుగులో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈక్రమంలోనే ఏప్రిల్ 6వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి. కచ్చితంగా ఈ సినిమాను చూడాలని చాలా మంది తెలుగు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆలే సూర్యతేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, అజయ్ ఘోష్, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న సినిమానే భరతనాట్యం. యాక్షన్ సినిమా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా మంచి హైపే క్రియేట్ అయింది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందనేది.
హర్షివ్ కార్తీక్ హీరోగా నటిస్తూనే.. డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమా బహుముఖం. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చిన్న సినిమా, కొత్త నటుడు కావడంతో.. ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ మూవీ టీం మాత్రం సినిమా సక్సెస్ అవుతుందనే గట్టి నమ్మకంతోనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. ఇక ప్రాజెక్ట్ జెడ్ అనే సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











