సినీ రంగంలో పెను విషాదం: చిన్న వయసులోనే రామ్ చరణ్ విలన్ కన్నుమూత
గతంలో కంటే ఈ మధ్య కాలంలో సినీ రంగంలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న చాలా సినిమా ఇండస్ట్రీల్లో వరుసగా చేదు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఎక్కువగా గుండెపోటు కారణంగా జరిగిన దారుణాలే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా ఈ రంగంతో సంబంధం ఉన్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ నటుడు డానియెల్ బాలాజీ మరణించారు.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే సినిమాల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న డానియెల్ బాలాజీ గత రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అయినప్పటికీ ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. డానియెల్ మరణాన్ని అక్కడి వైద్యులు ధృవీకరించారని కోలీవుడ్ వర్గాల ద్వారా తెలిసింది. డానియెల్ బాలాజీ మరణ వార్తను కొందరు ప్రముఖులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

నటుడు డానియెల్ బాలాజీ మరణంతో దక్షిణాదిలోని అన్ని సినీ పరిశ్రమల్లో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో డానియెల్ బాలాజీ మరణంపై పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన వయసు ఇప్పుడు 48 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక.. డానియెల్ బాలాజీ 2002లో వచ్చిన 'April Madhathil' అనే తమిళ సినిమా ద్వారా యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే 'ఘర్షణ' మూవీలో విలన్‌గా తెలుగు వాళ్లకు పరిచయం అయ్యారు. దీని తర్వాత ఆయన టాలీవుడ్‌లో 'సాంబ', 'చిరుత', 'టక్ జగదీష్' మూవీలు చేశారు. డానియెల్ బాలాజీ చివరిగా 2023లో 'అరియవన్' అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఇప్పుడు కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.


Click it and Unblock the Notifications











