ప్రాణం లేని బిడ్డను కడుపులో మోశాను.. టాలీవుడ్ యాంకర్ ఎమోషనల్
Sameera Sherief: ప్రముఖ టీవీ నటి, యాంకర్ సమీర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆడపిల్ల సీరియల్‌తో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. తన నటనతో తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదిరింది వంటి పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. అయితే ఈ అందాల తార గత కొద్ది కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది.
2019లో సమీర అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. 2021లో వీరికి అర్హాన్ అనే కుమారుడు జన్మించాడు. 2023 నవంబర్‌లో మళ్లీ గర్భవతి.. దీంతో ఆమె మళ్లీ తల్లి కాబోతున్నానని తెగ సంబురపడింది. కానీ, సంతోషం మధ్యలోనే ఆవిరైపోయింది. సమీరా తనకు గర్భస్రావం అయిందంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది సమీరా షరీఫ్. తనకు గర్భస్రావం అయిందంటూ ఎమోషనల్ అవుతూ దాని గురించి వివరించింది.

సమీరా ఆ వీడియోలో మాట్లాడుతూ.. 'నేను నవంబర్ 2023లో మళ్లీ గర్భం దాల్చాను. ఇంట్లో అందరూ సంతోషపడ్డాం. అర్హాన్ (కొడుకు)కి నా కడుపులో ఉన్న పాప అంటే చాలా ఇష్టమని.. రెగ్యులర్ చెకప్‌లలో భాగంగా రెండు స్కానింగ్‌ల కోసం వెళ్లినప్పుడు పాప బాగానే ఉందని చెప్పాడు. నేను పన్నెండవ వారంలో మరొక స్కాన్ కోసం వెళ్ళాను. కానీ ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయిందని డాక్టర్ చెప్పారు. ఆ బేబీ గుండె కొట్టుకోవట్లేదు అని చెప్పారు. అప్పుడే నా కలలన్నీ కూలిపోయాయి. ప్రాణం లేని బిడ్డను ఆల్మోస్ట్ నాలుగు వారాల పాటు కడుపులో మోసాను చాలా బాధ పడ్డాం.. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ట్యాబ్లెట్లతో బిడ్డను కడుపులో నుంచి బయటకు తీశారు' అంటూ సమీర భావోద్వేగానికి లోనైంది.
అయితే సమీరాకు గర్భస్రావం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2020లో జరిగిన తొలి గర్భం కూడా గర్భస్రావం జరిగిందంట. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. సమీర తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పలువురు టీవీ నటులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది


Click it and Unblock the Notifications











