అక్కినేని వారి పెళ్లి సందడి.. సమంత పెళ్లిలో లేనివి కొత్త వెరైటీలు..?నోరూరించేలా ఫుడ్ మెనూ ..!
తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని ఫ్యామిలీలో ఇవాళ పెళ్లి కార్యక్రమం జరగనుంది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య , సినీ నటి శోభిత ధూళిపాళ్ల వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. కొద్దినెలల క్రితం వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని విలాసవంతమైన ప్యాలెస్‌లలో కానీ.. విదేశాల్లో కానీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని తొలుత ఈ జంట అనుకున్నారు. అయితే చివరికి హైదరాబాద్‌లోనే, అది కూడా అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహం జరగనుంది. దీంతో ఈ పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు? వధూవరులిద్దరికీ ఎవరెవరు ఏమేం కానుకలు ఇవ్వనున్నారు? పెళ్లికి ఖర్చెంత? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..
అక్కినేని నాగచైతన్య - శోభితల వివాహం డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. వెడ్డింగ్ కార్డ్ కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. అటు శోభిత ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం, మంగళ స్నానం, గౌరీ పూజ ఇతర సాంప్రదాయ క్రతువు ఘనంగా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలను శోభిత ఆమె సోదరి సమంతలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

ఇక శోభిత - నాగచైతన్య పెళ్లికి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానున్నారట. రామ్ చరణ్ - ఉపాసన, మహేశ్ బాబు - నమత్ర, ఎస్ఎస్ రాజమౌళి, నయనతార, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకటేశ్, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు హాజరుకానున్నారు. ఇక ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా శోభిత - నాగచైతన్యల వివాహానికి తరలిరానున్నారు.
మరోవైపు.. పెళ్లి నేపథ్యంలో శోభిత తన తల్లితో కలిసి స్వయంగా షాపింగ్ చేశారు. ఖరీదైన గోల్డ్ కలర్ జరీ వర్క్‌తో కూడిన కాంచీవరం చీరను ఆమెను కొనుగోలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిపుణులైన పనివారితో చేయించిన ఓ చీర, పొందూరు ఖాదీ సంబంధిత మరో చీరను కూడా శోభిత కొనుగోలు చేయించారట. ఇక కాబోయే కోడలి కోసం నాగార్జున దాదాపు రూ.2 కోట్ల విలువైన టయోటా లెక్సస్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్.
పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య - శోభితల వివాహం జరగనుంది. బుధవారం దాదాపు ఏడెనిమిది గంటల పాటు వివాహానికి సంబంధించిన క్రతువులు జరగనున్నాయి. రాత్రి 8 గంటల 10 నిమిషాలకు పెళ్లి ముహూర్తంగా వేద పండితులు నిశ్చయించినట్లుగా తెలుస్తోంది. ఇక పెళ్లికి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను నాగార్జున సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు భారతదేశంలో ఫేమస్ వంటకాలను మెనూలో సిద్ధం చేశారట.
కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ, డజను బిర్యానీ వెరైటీలు, బంగాళదుంప కుర్మా, మామిడికాయ ప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, మజ్జిగ పులుసు , స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి లాంటి ప్రత్యేక వంటకాలను అతిథిలకు వడ్డించనున్నట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











