కరోనా బారిన పడ్డ హైదరాబాద్ కమెడియన్.. స్నేహితులు చేసిన పనికి..
మరో సినీ యాక్టర్ కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా ఏ రేంజ్ లో చెలరేగుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క నెలలోనే వేల సంఖ్య నుంచి 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ముందు వరకు కంట్రోల్ లో ఉన్న కరోనా కేసుల సంఖ్య చూస్తుండగానే లక్షలను దాటి వెళుతోంది. ఇక తెలంగాణలో కూడా ఆ సంఖ్య గట్టిగానే పెరుగుతోంది.

హైదరాబాద్ కమెడియన్..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. హైదరాబాది లోకల్ హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్బర్ బిన్ తబర్ కూడా కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. ఈ కమెడియన్ నాని - కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా సినిమాలో కూడా నటించాడు. ఇక ఎక్కువగా లోకల్ హిందీ మూవీస్ తో క్రేజ్ అందుకున్న అక్బర్ గత కొంత కాలంగా జ్వరంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

పాజిటివ్..
అయితే కోవిడ్ 19 టెస్టులు నిర్వహించగా.. అందులో పాజిటివ్ అని తేలింది. వెంటనే అక్బర్ తో తిరిగిన వారిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్ లోకి పంపించారు. ప్రస్తుతం అక్బర్ ను ఐసియు వెంటిలేటర్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇంకా అక్బర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

పైసా సినిమాలో..
అయితే అప్పటికే అతను నిలకడగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అక్బర్ పైసా సినిమాతో పాటు పాటు లోకల్ హైదరాబాద్ సినిమాల్లో నటించాడు. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. ఇక గత వారం హైదరాబాద్ లోని తన స్నేహితులను కలిసి వచ్చిన అక్బర్ అక్కడే కరోనా కాటుకు గురైనట్లు తెలుస్తోంది.
Recommended Video

రెడ్ జోన్..
హైదరాబాద్ లో చాలా వరకు రెడ్ జోన్లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పాతబస్తీ, చార్మినార్ వంటి పాత్రల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి జనాలు పట్టించుకోకుండా బయట తిరుగుతూనే ఉన్నారు. కొన్ని ఏరియాల్లో పోలీసులు ఆంక్షలను కూడా లెక్క చేయడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో రోజేరోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భాగ్యనగరంలో పెరుగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











