TV5 Murthy: 54 ఏళ్ల వయసొచ్చినా నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే..!
టీవీ5 మూర్తి.. ఈ పేరు తెలియని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అధ్భుతమైన టాలెంట్ కల్గిన ఈ జర్నలిస్ట్... ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేశారు. అలాగే అనేక లైవ్ డిబేట్లలో పాల్గొని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ కెరియర్ లో టాలెంటెడ్ జర్నలిస్టుగా కొనసాగుతున్న ఈయన డైరెక్టర్ గా కూడా మారారు. ముఖ్యంగా నారా రోహిత్ తో కలిసి ప్రతినిధి 2 సినిమా చేయబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ప్రసత్తం 54 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అందుకు గల కారణాలను తొలిసారి రివీల్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1970 జనవరి 1వ తేదీన జన్మించిన ఈయన తన 24 ఏళ్ల వయసులోనే జర్నలిజంలోకి అడుగు పెట్టారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా కొనసాగుతూనే ఉన్నారు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన ఎంతో మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేసి, అనేక డిబేట్లు కూడా నిర్వహించారు. ఇలా ప్రతినిత్యం వార్తలు చదివే ఈయన తాజాగా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా 2021లో ప్లే బ్యాక్ సినిమాలో నటించి మెప్పించారు. తొలిసారే సినిమాలో నటించిన అద్భుతమైన టాలెంట్ కనబర్చారు.

ఇక ఆ తర్వాత నుంచి మరే సినిమాలోనూ కనిపించని ఈయన తాజాగా ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అదే ప్రతినిధి2. నారా రోహిత్ హీరోగా మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ అంటే ఈరోజే విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయకపోవడంతో.. వాయిదా పడింది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ సమయంలో.. పొలిటికల్ నాయకుల తప్పొప్పుల గురించి చేసిన ఈ సినిమాను రిలీజ్ చేయొద్దని అనుకుంటున్నారు. ఈక్రమంలోనే సినిమా వాయిదా పడింది.
ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం మూర్తి వయసు 54 ఏళ్లు. ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆస్తి, అందం, కెరియర్ అన్నీ బాగున్నా ఆయనకు ఇంకా పెళ్లి కాకపోవడం చాలా మంది ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. ముఖ్యంగా తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదిన.. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే.. ఎమోషనల్ ఇండిపెండెన్స్ చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఎమోషనల్ గా ఎవరిపై ఆధార పడలేదని, అలాగే తనపై ఎవరూ ఆధారపడకూడదనే తాను పెళ్లికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

తనకు తల్లిదండ్రులు, సోదరులు, అక్కాచెల్లెల్లు ఉన్నారని.. కానీ పెళ్లికి మాత్రం తాను దూరం అని తెలిపారు. వృద్ధాప్యంలో కూడా తోడు లేకుండా ఎలా ఉంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నాకెవరో ఏదో చేసి పెట్టాలనే ఉద్దేశంతో వారి జీవితాలను నేను లాక్కోవడం సరికాదని.. అయినా వృద్ధాప్యంలో తోడు కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే.. వాళ్లు జీవితాంతం కలిసుంటారనే నమ్మకం లేదని, ఒకవేల మధ్యలోనే వాళ్లు కాలం చేసినా, విడాకులు తీసుకున్నా పెళ్లి చేసుకున్నదానికి ఫలితమే లేదు కదా అంటూ వివరించారు. భవిష్యత్తులో కూడా తాను పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











