చిరు,కొరటాల మూవీ టైటిల్ అదే.. స్పందించిన కొణిదెల ప్రొడక్షన్
మెగాస్టార్ చిరంజీవి సైరా విజయంలో ఉండగానే.. తన తదుపరి మూవీని ప్రారంభించేశారు. దసరా రోజున లాంఛనంగా మూవీని ప్రారంభించేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీపై ఎప్పటి నుంచో అంచనాలు నెలకొన్నాయి. భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగాస్టార్ కోసం ఇంతకాలం ఎదురుచూశాడు కొరటాల శివ.
సైరా విడుదల ఆలస్యం కావడంతో కొరటాల తన స్క్రిప్ట్‌కు మరింత పదును పెట్టారు. సైరా విజయవంతమైన నేపథ్యంలో చిరంజీవి 152వ చిత్రం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీ కథకు సంబంధించిన ఊహాగానాలు అప్పుడే వైరల్ కాగా.. నేడు ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కూడా వచ్చేసింది.

ఓ అభిమాని తయారు చేసిన ఈ పోస్టర్ అధికారికంగా విడుదల చేసిందే.. అనేంతగా అద్భుతంగా ఉంది. గోవింద ఆచార్య అంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టర్ మెగాఫ్యాన్స్‌ను ఇట్టే ఆకర్శించింది. దీంతో అది క్షణాల్లో వైరల్ అయింది. చివరకు అది కొణిదెల ప్రొడక్షన్ వరకు చేరింది. ఈ వార్తలపై స్పందిస్తూ.. చిరంజీవి నటించనున్న 152వ చిత్ర టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు.. ఒకవేళ కన్ఫామ్ అయితే తామే అధికారికంగా ప్రకటిస్తామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











