twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోపానికి పోయి కుంపటిలో కాలు పెట్టిన పూజా హెగ్డే.. డోస్ పెంచుతున్న సమంత ఫ్యాన్స్!

    |

    సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇతర టెక్నీషియన్స్ మధ్య ఈగోలు మనస్పర్థలు ఎంతవరకు ఉంటాయో తెలియదు గాని హీరోయిన్స్ మధ్య తప్పకుండా ఉంటాయని చెప్పవచ్చు. ఎవరో ఒకరిద్దరు తప్పితే హీరోయిన్స్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరు. చాలా వరకు స్టార్ హీరోయిన్స్ తెర వెనుక ఈగోలతో సీరియస్ గా ఉంటారని ఒక టాక్ ఉంది. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ మధ్య కూడా అలాంటి వాతావరణమే కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది.

    హ్యాక్ అయ్యింది..

    హ్యాక్ అయ్యింది..

    రీసెంట్ గా పూజా హగ్డే తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో సమంత అందంగా లేదంటూ ఒక పోస్ట్ వచ్చిన విషయం తెలిసిందే. సడన్ గా తన ఎకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని క్లారిటీ ఇచ్చింది గాని వెంటనే సమంత పై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మొత్తానికి ఎకౌంట్ తన చేతుల్లోకి వక్గినట్లు చెప్పిన బేబి వెలువడిన పోస్ట్ లపై సరైన వివరణ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

     కావాలనే చేసిందా..

    కావాలనే చేసిందా..

    ఇకపోతే ప్రస్తుతం ఓ వర్గం నెటీజన్స్ పూజా హెగ్డే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమంతపై కావాలనే ఈ విధంగా పోస్ట్ లు పెట్టి హేళన చేసిందని కామెంట్ చేశారు. వివాదం ఎటు నుంచి ఎక్కడికి పోతుందో అని కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. సమంత ఫాలోవర్స్ పూజా తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

    సెటైర్స్..

    సెటైర్స్..

    ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి, సింగర్ చిన్మయి కూడా పూజా హెగ్డేపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసినట్లు అర్ధమవుతోంది. ఇక మరోవైపు సమంత కూడా ఇన్ డైరెక్ట్ గానే సెటైర్స్ వేస్తోంది గాని పూజా హెగ్డే పేరు ప్రస్తావించడం లేదు. చూస్తుంటే పూజా హెగ్డే కుంపటిలో కాలు పెట్టినట్లు ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సమంత ఫ్యాన్స్ ప్రస్తుతం సారి చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    Pooja Hegde Controversial Post On Samantha, She Claims That Her Account Got Hacked
    డోస్ పెంచిన ఫాలోవర్స్..

    డోస్ పెంచిన ఫాలోవర్స్..

    సోషల్ మీడియాలో నిన్నటి వరకు పూజా హగ్డేకు మద్దతు ఎక్కువగా వచ్చింది. ఇక ప్రస్తుతం సమంత ఫ్యాన్స్ డోస్ పెంచుతున్నారు. ఎలాగైనా పూజా జరిగిన విషయంపై క్షమాపణ కోరాల్సిందే అంటున్నారు. సోషల్ మీడియాలో #PoojaMustApologizeSamantha అనే ట్యాగ్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు సమంత ఫాలోవర్స్. ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో తెలియదు గాని పూజా హెగ్డే చిన్న వివరణ ఇస్తే బెటర్ అంటున్నారు నెటీజన్స్.

    English summary
    Social media is now a major weapon in the hands of the Stars. Stars were once interpreted by the media as to what kind of Clarity they were. But now, no matter how many rumors come out, brave facts are being revealed through social media. Pooja Hegde's social media account has been hacked recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X