అల్లు అర్జున్ అరెస్ట్ .. వీళ్ళ మౌనంపై అల్లు ఫాన్స్ సీరియస్
ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన సంచలన వార్త ఏంటో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌కి చెందిన ఒక టాప్ మోస్ట్ హీరో అరెస్ట్ కావడం అనేది ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. అయితే పాన్ ఇండియా సెన్సేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద ఘటనలో ఊహించని విధంగా బన్నీని అరెస్ట్ చేయడం షాకింగ్ గా మారింది.
తొలుత చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోగా అక్కడి నుంచి ఈ కేసు అల్లు అర్జున్ వరకు దాదాపు రాదనే అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసే వరకు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కాగా ఈ సమయంలో తెలుగు సినిమా నుంచి అనేకమంది చిన్నా పెద్ద హీరోస్ అంతా అల్లు అర్జున్‌కి అండగా నిలిచి తమ సంఘీభావం వ్యక్తం చేశారు.

సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకా పలువురు స్టార్స్ మాత్రం ఇప్పటికీ అల్లు అర్జున్ విషయంలో స్పందించకపోవడం కనీసం చిన్న పోస్ట్ కూడా పెట్టకపోవడం అనేది అల్లు ఫ్యాన్స్ పర్శనల్‌గా తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ కోసం మొట్ట మొదటగా నాచురల్ స్టార్ నాని స్పందించాడు. ఈ తర్వాత శర్వానంద్, నితిన్, ఆది ఇలా చాలా మంది మిడ్ రేంజ్ హీరోస్ కూడా స్పందించారు.
మెగా కుటుంబం నుంచి అయితే మెగాస్టార్ చిరంజీవి, అలాగే ఇన్ని రోజులు అల్లు అర్జున్ విషయంలో కారాలు మిరియాలు నూరుతున్న నాగబాబు కూడా వెంటనే అల్లు వారి ఇంటికి వెళ్లారు. కానీ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ లాంటి స్టార్స్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఇపుడు చర్చగా మారింది.

సరే వీరి విషయం పక్కన పెడితే మెగా కుటుంబం నుంచే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు మాత్రం కనీస స్పందన చూపించకపోవడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిస్కష్ చేసుకుంటున్నారు. మెగా కుటుంబం నుంచి కేవలం చిరు, నాగ బాబులు మాత్రమే స్పందించారు. మిగిలిన వారు ఇంకా ఎలాంటి స్పందన చూపించలేదు అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీనితో మళ్ళీ ఈ సమయంలో కూడా వీరు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అయితే పోస్ట్ వేసినంత మాత్రానే ఒక కుటుంబమా? వెయ్యకుండా డైరెక్ట్ గా వెళ్లి కలిస్తే వీరంతా ఏమవుతారు అని మెగా ఫ్యాన్స్ లాజిక్కులు తీస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాత్రం కొందరి మౌనం అల్లు ఫ్యాన్స్ ని ఒకింత బాగా డిజప్పాయింట్ చేసిందట.


Click it and Unblock the Notifications











