RRR రికార్డులపై బాహుబలి నిర్మాత షాకింగ్ కామెంట్.. ఎవరిని డీ గ్రేడ్ చేస్తున్నావ్ అంటూ ఫ్యాన్స్ అప్సెట్!

బాక్సాఫీస్ వద్ద రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాల రికార్డులు మాత్రం కొన్ని ఏళ్ల పాటు అలానే చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆ రికార్డులను బ్రేక్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. ఇక బాహుబలి రికార్డులను RRR సినిమా బ్రేక్ చేస్తుంది అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తరుణంలో బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ సోషల్ మీడియాలో స్పందించిన విధానం మిగతా అభిమానులను కాస్త అసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పాజిటివ్ గానే అన్నప్పటికీ చేసిన కామెంట్ లో మాత్రం ఇతర హీరోల ను తగ్గించే విధంగా అర్థం వచ్చేలా ఉంది అని కొందరు అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

RRR రికార్డులపై బాహుబలి నిర్మాత షాకింగ్ కామెంట్.. ఫ్యాన్స్ అప్సెట్ | Filmibeat Telugu
అద్భుతం అంటూ..

అద్భుతం అంటూ..

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు కోసమే మెగా నందమూరి అభిమానులతో పాటు ఎంతో మంది సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాకు మొత్తానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సినిమా అద్భుతంగా ఉంది అంటూ చాలామంది రివ్యూలు ఇస్తున్నారు.

మొన్నటివరకు నాన్ బాహుబలి

మొన్నటివరకు నాన్ బాహుబలి

ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా సినిమా స్పెషల్ షోను వీక్షించడం జరిగింది. అయితే ఈ తరుణంలో RRR సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బాహుబలి సినిమాలను రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నటి వరకు బాహుబలి రికార్డులు ఒక లెక్క మిగతా సినిమాల రికార్డులు మరొక లెక్క అనే విధంగా నాన్ బాహుబలి అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు.

ఇక నుంచి నాన్ SSR

ఇక నుంచి నాన్ SSR


ఇక రీసెంట్ గా బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ కూడా మొదట అదే తరహాలో సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది. ఇక నుంచి నాన్ RRR రికార్డ్స్ అని అన్నారు. ఇక ఆ తర్వాత మరొక ట్వీట్ లో.. ఓకే అంటూ ఇక నుంచి నాన్ SSR (ఎస్ఎస్ రాజమౌళి) రికార్డ్స్ అని పేర్కొన్నారు. అంటే ఇక నుంచి మొత్తంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమా లో రికార్డులు ఒక లెక్క.. మిగతా సినిమాల రికార్డులు మరొక విధంగా ఉండబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

 ఫ్యాన్స్ అప్సెట్

ఫ్యాన్స్ అప్సెట్

ఇక శోభు యార్లగడ్డ చేసిన ఆ రకమైన ట్వీట్స్ పై మిగతా హీరోల అభిమానులు కాస్త అప్సెట్ అవుతున్నారు. ఒకరకంగా ఇది హీరోలను తగ్గించినట్లు అవుతుంది అని ఎవరిని డీ గ్రేడ్ చేయడానికి ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు అని మరికొంతమంది అప్సెట్ అవుతున్నారు. అంటే రాజమౌళి గొప్పతనమే ఉంటుందా హీరోల గొప్పదనం ఏమీ ఉండదా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

రికార్డులు.. రాజమౌళి ఒకే మాట!

రికార్డులు.. రాజమౌళి ఒకే మాట!


ఇక రికార్డుల గురించి ఎవరు ఎన్ని మాట్లాడుతున్న కూడా రాజమౌళి మాత్రం ఒకే తరహా సమాధానం అయితే ఇస్తున్నాడు. రికార్డులు మంచి ఆనందాన్ని కలిగిస్తాయి కానీ అంతకంటే ముందు సినిమా పై పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి అంటూ సినిమా బిజినెస్ చేసే ఎగ్జిబ్యుటర్స్ బయ్యర్లు సేఫ్ జోన్ లోకి రావాలి అని వివరణ ఇస్తున్నారు. ముందు ఆ విధంగా అందరికీ వారి డబ్బులు వచ్చేస్తే అంతకంటే మరొక గొప్ప ఆనందం తనకు ఉండదు అని కూడా రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X