twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ ఎఫెక్ట్: రజనీకాంత్‌కు అభిమానుల సెగ.. ఇదెక్కడి తలనొప్పి తలైవా?

    |

    సినిమా హీరోలు వెండితెరపై చాలెంజ్ లు చేసినంత ఈజీగా రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటే బావుంటుందని అభిమానులు ఎంతగానో ఊహించుకుంటారు. అయితే వారి ఊహలకు అందే విధంగా రియల్ లైఫ్ లో ఉండాలి అంటే చాలా కష్టమైన పని. అందరూ హీరోలు పొలిటికల్ గా సక్సెస్ కాలేరని గత కొన్నేళ్లుగా రుజువవుతూనే ఉంది. ఇక రజనీకాంత్ ఏమనుకున్నాడో ఏమో గాని మొత్తానికి పొలిటికల్ ఫైట్ నుంచి యూ టర్న్ తీసుకోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

    పొలిటికల్ ఎంట్రీ.. ఈనాటిది కాదు

    పొలిటికల్ ఎంట్రీ.. ఈనాటిది కాదు

    తలైవా రాజకీయ ప్రస్థానంపై చర్చలు ఈనాటిది కావు. ఆయన సూపర్ స్టార్ ట్యాగ్ తో జనాల్లో తలైవా అనే గుర్తింపు తెచ్చుకున్నప్పటి నుంచే వస్తోంది. MGR తరహాలోనే రజనీ మంచి క్రేజ్ అందుకోవడంతో తమిళ రాజకీయాల్లో ఆయన కూడా సక్సెస్ అవుతారని చాలా మంది నమ్మకం. గత 30 ఏళ్ళుగా పొలిటికల్ నిర్ణయాలపై చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి.

    ఊహించని విధంగా వెనుకడుగు

    ఊహించని విధంగా వెనుకడుగు

    పొలిటికల్ ఎంట్రీపై గతంలో ఎన్ని రకాల రూమర్స్ వస్తున్నా కూడా రజనీకాంత్ ఏనాడు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడప్పుడు తనదైన శైలిలో ఇన్ డైరెక్ట్ గా రాజకీయాల్లో ఎంట్రీ ఉంటుందని చెబుతూ వచ్చారు. ఇక ఫైనల్ గా ఏడాది ఏండింగ్ లో పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పి ఒక్కసారిగా అభిమానుల్లో అంచనాలను పెంచారు. కానీ ఆ సమయానికి వచ్చేసరికి ఆరోగ్య కారణాల వల్ల వెనుకడుగు వేశారు.

     రాజకీయాల్లోకి రావాల్సిందే..

    రాజకీయాల్లోకి రావాల్సిందే..

    ఇక రజినీకాంత్ మంగళవారం చెప్పిన నిర్ణయానికి అభిమాన లోకం అయితే ఒక్కసారిగా షాక్ అయ్యింది. రాజకీయ ప్రకటన ఉండబోదని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. వెంటనే రజనీకాంత్ తన మాటను వెనక్కి తీసుకోవాలని, రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ ధర్నా చేస్తున్నారు.

     ఇదెక్కడి తలనొప్పి తలైవా?

    ఇదెక్కడి తలనొప్పి తలైవా?

    కొంత అస్వస్థతకు గురైన రజినీకాంత్ హాస్పిటల్ కు వెళ్ళగానే ఒక్కసారిగా ఆయన ఆలోచనే మారిపోయింది. ఆరోగ్య కారణంగా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంతో మరో తలనొప్పి ఎదురవుతోంది. అభిమానులైతే చాలా హార్ట్ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని ఏకంగా ఆయన ఇంటికి చేరుకొని నిన్న సాయంత్రం నుంచి నిరసన తెలుపుతున్నారు. మరి అలాంటి అభిమానుల కోసం రజనీకాంత్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

    ఆ ఆలోచనల వల్ల..

    ఆ ఆలోచనల వల్ల..

    ఇటీవల తలైవా కొంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అన్నాతే షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రోజుకు 14గంటలు పని చేయాలని అనుకున్నారు. ఒకవైపు పార్టీ ఆలోచనలో మరోవైపు సినిమా పనుల వల్ల 70ఏళ్ల రజినీకాంత్ కొంత అస్వస్థతకు గురి కావాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్ చికిత్స తీసుకొని మళ్ళీ ఇంటికి ఆరోగ్యంగా చేరుకున్నారు.

     కారణం అదేనా

    కారణం అదేనా

    అయితే అనారోగ్య కారణాల దృష్టి లో వుంచుకుని పాలిటిక్స్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి రాజకీయ ఆరంగేట్రంపై సుదీర్ఘంగా చర్చించినట్లు టాక్ వస్తోంది. కూతుళ్ళు కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు చాలా వరకు ఆయన ఈ వయసులో రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో అభిమానులకు రజినీకాంత్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

    English summary
    Superstar Rajinikanth to not enter politics official statement, Rajinikanth Discharge From Apollo Hospital, Rajinkanth joined in apollo hospital, Rajinikanth joined in hospital with high bp, Rajinikanth fell ill health, rajinikanth not well, Rajinikanth tested coronavirus negative, crew tested coronavirus positive in Rajinikanth's Annaatthe shoot,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X