అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ.. శివరాత్రి తర్వాత క్లారిటీ!
'నా పేరు సూర్య' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కమిటైన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
శివరాత్రి తర్వాత చిత్ర యూనిట్ నుంచి అపీషియల్ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. హీరోయిన్, సినిమా లాంచింగ్ డేట్, ఇతర వివరాలు ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తారని టాక్. హీరోయిన్‌గా పూజా హెగ్డే దాదాపు ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

షూటింగ్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్రిప్టుకు ఫినిషిట్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
గీతా ఆర్ట్స్, హారిక హాసిన క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన నేపథ్యంలో అభిమానులు వీరి కాంబినేషన్‌పై ఆసక్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











