Rajinikanth హఠాత్తుగా అమెరికా ప్రయాణంపై అనుమానం.. ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ గత ఏడాది రాజకీయాల్లోకి వస్తారని చాలామంది అభిమానులు ఆశించారు. అయితే ఈ వయసులో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని పైగా ఆరోగ్యం కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదని మళ్ళీ వెనక్కి తగ్గారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల కూడా తలైవా వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక చాలా రోజుల తరువాత రజనీకాంత్ హఠాత్తుగా అమెరికా వెళ్లడంపై కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 విదేశాల్లో కూడా

విదేశాల్లో కూడా

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం తమిళ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. విదేశాల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అందుకే తలైవాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతుంటుంది.

అర్ధరాత్రి సమయాల్లో కూడా

అర్ధరాత్రి సమయాల్లో కూడా

ఇక కరోనా సెకండ్ వేవ్ ముందు వరకు సూపర్ స్టార్ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నత్తే అనే సినిమా చేస్తున్న రజనీకాంత్ కోవిడ్ భారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆ సినిమా షూటింగ్ జరిగింది. అర్ధరాత్రి సమయాల్లో కూడా షూటింగ్ చేసినట్లు అప్పట్లో టాక్ అయితే వచ్చింది.

ప్రత్యేక అనుమతులు

ప్రత్యేక అనుమతులు

ఇక సెకండ్ వేవ్ తో షూటింగ్ పనులకు ఫ్యాకప్ చెప్పి చెన్నైకు వెళ్లిపోయిన రజనీకాంత్ ఇటీవల మళ్ళీ అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ ప్రభావం ఎక్కువ కావడం వలన హెల్త్ చెకప్ కోసం తలైవా అమెరికా వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశి ప్రయణాలపై ఆంక్షలు విధించినప్పటికి రజనీకాంత్ కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్లు సమాచారం.

Recommended Video

Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
 అభిమానుల్లో ఆందోళన

అభిమానుల్లో ఆందోళన

14 మంది ప్రయాణించే ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఒక మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇదివరకే రజనీకాంత్ అల్లుడు ధనుష్ హాలీవుడ్ మూవీ ' ది గ్రేట్ మ్యాన్' షూటింగ్ కోసమని అమెరికా వెళ్ళాడు. అతనితో పాటు సతీమణి ఐశ్వర్య కూడా పిల్లలతో కలిసి వెళ్లింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X