డైరెక్ట్ గా నన్ను ఒక రాత్రికి రమ్మన్నాడు.. ప్రముఖ డైరెక్టర్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Casting Couch: ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట అమ్మాయిలు దాడులకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలు సర్వేలు, నివేదికలు వెల్లడించాయి. ఇక సినిమా అనే రంగుల ప్రపంచంలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో తాము కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు? అసలేం జరిగిందంటే..?
మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతోన్న దారుణాలపై జస్టిస్ మ కమిషన్ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ తరుణంలో పలువురు సెలబ్రెటీలు తమకు ఎదురైన ఆ చేదు అనుభవాలను ఏదో ఒక సందర్భంలో బయటపెడుతున్నారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) షాకింగ్ కామెంట్స్ చేశారు.

తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో తాజాగా పంచుకుంది.
ఫాతిమా సనా మాట్లాడుతూ.. 'నేను ఓ సినిమా కోసం ఆడిషన్ కోసం వెళ్లాను, ఆ సమయంలో మూవీ మేకర్స్ .. మీరు ఏం చేయడానికైనా సిద్ధమేనా..? అని అడిగారు. అందుకు నేను కష్టపడి పనిచేస్తాను. క్యారెక్టర్ కోసం ఏమైనా చేయాడానికి సిద్దమే అని చెప్పా.. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నేను కూడా అతడు ఎంతకు దిగజారతాడో తెలుసుకుందాం అని ఏమీ తెలియనట్టు నటించాను' అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపింది.



Click it and Unblock the Notifications











