బైక్ అమ్మకానికి పెట్టిన టాలీవుడ్ నటుడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు!

టాలీవుడ్ లో తకిట తకిట అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హర్షవర్ధన్ రాణే తెలుగులో చాలా సినిమాలు చేసినా ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అవును, అవును 2, లాంటి సినిమాల్లో లీడ్ రోల్ లో నటించినా రాని పేరు ఆయన ఫిదాలో చేసిన క్యారెక్టర్ కి వచ్చింది. ఈ క్యారెక్టర్ ఆయన తెలుగు వారికి నోటెడ్ అయ్యేలా చేసింది. నిజానికి ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో మంచి బిజీగా సినిమాలు చేస్తున్నారు. జాన్ అబ్రహం బ్యానర్లో ఒక సినిమా ఇప్పటికే ప్రొడక్షన్ దశలో ఉండగా ఇటీవల ఆయనకు మరో అవకాశం కూడా జాన్ అబ్రహం ఇప్పించారు. అయితే ఇప్పుడు ఈ నటుడు తన బైక్ ను అమ్మకానికి పెట్టడం సంచలనంగా మారింది.

అయితే అది తన సొంత అవసరాల కోసం కాదు ప్రజల కోసం. అవును మీరు చదువుతున్నది నిజమే, దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఈరోజు అయితే సింగిల్ డేలో నాలుగు లక్షల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఆక్సిజన్ కొరత తీర్చడానికి తన వంతుగా తాను కొంత సహాయం చేయాలి అనుకుంటున్నానని అందుకోసం తన బైక్ ఇచ్చేయాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

 Fidaa actor Harshavardhan Rane sells bike for Oxygen

ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్న ఆయన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఇచ్చి నా బైక్ ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఇవ్వాలని అనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో ఇవి ఎక్కడ ఇది దొరుకుతాయో చెప్పాలని ఆయన కోరారు. నిజానికి గత ఏడాది అక్టోబర్ నెలలోనే హర్షవర్ధన్ రాణేకి కరోనా పాజిటివ్ వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే ఆయన చేసిన పోస్టులకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రసంశలు కురుస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X