RRR విడుదలకు ముందు కొట్టుకున్న ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్.. అలా మొదలై కొట్టుకునే దాకా?

రాజమౌళి ఊహల నుంచి పుట్టిన కల్పిత కధ RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం, మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినీ అభిమానులతో పాటు, మెగా, నందమూరి అభిమానులు సినిమా కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్ల వద్ద అభిమానుల సందడి కూడా మొదలైంది. అయితే ఈ సినిమా విషయంలో చివరి నిముషంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు

కల్పిత కధ జోడించి

కల్పిత కధ జోడించి


తెలుగు రాష్ట్రాలకు చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలకు కల్పిత కధ జోడించి రాజమౌళి తెరకెక్కించిన మూవీ RRR -రౌద్రం రణం రుధిరం. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వాయిదా పడి

వాయిదా పడి


పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రేయ శరన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ వంటి వారు నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR మూవీని 2020 లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా అనేక సార్లు పెరుగుతూ తగ్గుతూ రావడంతో అది వాయిదా పడింది. ఆ తర్వాత కూడా మరికొన్ని డేట్లను ప్రకటించారు.

అభిమానులు చించి వేసినట్లు

అభిమానులు చించి వేసినట్లు


అయితే ఎట్టకేలకు విడుదల అవుతూ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య రేగిన చిచ్చు పెద్ద గొడవకు కారణం అయింది. RRR సినిమా ఫాన్స్ షో టికెట్ల విషయంలో అభిమానుల మధ్య రగడ మొదలైనట్టు చెబుతున్నారు. ఫాన్స్ షో టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నేతల పేర్లు ముద్రించడంతో అసలు వివాదం మొదలైనట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే థియేటర్ ఎదుటే ఫ్యాన్స్ షో టికెట్లను అభిమానులు చించి వేసినట్లు తెలుస్తోంది.

గొడవకు కారణం

గొడవకు కారణం


అందుతున్న సమాచారం మేరకు కుప్పంలోని మూడు థియేటర్లలో మూడు బెనిఫిట్ షోలకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫోటోలతో మూడు వేల టికెట్లను అభిమానులు ముద్రించారు. అయితే RRR సినిమా టికెట్లపై ఒక హీరోకు చెందిన అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండటమే అభిమానుల మధ్య గొడవకు కారణం అని అంటున్నారు.

Recommended Video

RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
పెద్దది చేయాల్సింది కాదని

పెద్దది చేయాల్సింది కాదని


అయితే ఈ గొడవ విషయం ఇంత పెద్దది చేయాల్సింది కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళితో కలిసి దేశమంతా సినిమా గురించి ప్రచారం చేస్తుంటే ఈ సమయంలో ఇలా తమ తమ హీరోల పరువు తీసేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అంటున్నారు. వాళ్ళు ఇంత కష్టపడి సినిమాను ప్రమోట్ చేస్తుంటే ఇలా చేయడం ఏ మాత్రం భావ్యం కాదని అంటున్నారు. ఇక సినిమా ఎలా ఉండనుంది అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X