Fighter Twitter Review: అదరగొట్టేలా హృతిక్, దీపిక కెమిస్ట్రీ.. ఫైటర్ హిట్టా? ఫట్టా?

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ నటించిన చిత్రం ఫైటర్. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై మమతా ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అంకు పాండే నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకులు విశాల్, శేఖర్, చిత్ బల్హారా సంగీతం అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయం ఏమిటంటే?

ఫైటర్ మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. స్క్రీన్ మీద హృతిక్, దీపిక పదుకోన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. యాక్షన్ సీన్లు హై లెవెల్‌లో ఉన్నాయి. వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫి, బీజీఎం, స్టోరి లైన్, సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ టాప్ లెవెల్‌లో ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గూస్‌బంప్స్ వస్తాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

 Fighter Twitter Review: Hrithik Roshan, Deepka Padukone sizzles with on Screen Chemistry
ఫైటర్ సినిమాలో హీరో బాగున్నాడు. హీరోయిన్ గ్లామర్‌తో అదరగొట్టింది. విలన్ కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. కానీ సినిమానే బుర్ర తిప్పేసింది. జస్ట్ వన్ మోర్ స్లీప్ అంటూ నెటిజన్ నర్మగర్బంగా ట్వీట్ చేశాడు.

ఫైటర్ సినిమా నిజంగా యూనిక్ సబ్జెక్ట్. అన్ బిలీవబుల్ ఎక్స్‌పీరియె్స్. ఇండియన్ సినిమా ప్రతిభను ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. పక్కా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. హృతిక్ రోషన్ యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఫైటర్ సినిమాలో ఏరియల్ షాట్స్ బాగున్నాయి. అవి సీన్లుగా అనిపించవు. రియల్ ఎక్స్‌పీరియెన్స్ అనిపిస్తాయి. తెరమీద చూస్తుంటే.. ఊపిరి తీసుకొనివ్వకుండా ఉంటాయి. మూవీ బాగుంది. హృతిక్ రోషన్ బాగా చేశాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫైటర్ సినిమాలో యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఫీలింగ్ కలిగించాయి. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్. ప్రతీ ఒక్కరికి మంచి అనుభూతిని కలిగిస్తుంది అని నెటిజన్ తన రివ్యూను ట్విట్టర్‌లో రాశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X