‘అఖండ’లో ఆ రెండు హైలైట్లు: బాలకృష్ణ అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయం

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారాయన. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి హిట్లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా సమయంలోనూ శరవేగంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ'ను గత చిత్రాలకు భిన్నంగా రూపొందిస్తున్నారట. అందుకోసం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాలయ్య ఈ మూవీలో అఘోరాగానూ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఎంతో హైలైట్‌గా ఉంటాయట. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అదిరిపోతాయని సమాచారం. మొత్తంగా ఈ చిత్రం యాక్షన్ ప్లస్ ఎమోషన్స్‌తో కూడి అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేలా ఉంటుందని టాక్.

 Fights and Emotions Highlight in Nandamuri Balakrishna Akhanda

ఇక, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ 'అఖండ' మూవీ షూటింగ్‌ను వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరిపారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఇది 43 మిలియన్లకు పైగా వ్యూస్‌ను అందుకుని రికార్డులు క్రియేట్ చేసేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X