తెలుగు ప్రేక్షకుల కోసం మరో ఓటీటీ.. నవంబర్ 1వ తేదీన ఫిలిమ్ యాప్ ప్రారంభం
లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా దేశంలో ఓవర్ ది టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాయి. సినిమా థియేటర్ల మూత పడటంతో ఓటీటీలే ప్రేక్షకులకు వినోదానికి అడ్డగా మారాయి. తెలుగులో పలు ఓటీటీ యాప్స్ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరో ఓటీటీ యాప్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నది. ఫిలిమ్ అనే ఓటీటీని నంబర్ 1న ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఫిలిమ్ యాప్‌లో కొత్త సినిమాల ప్రీమియర్లు, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ప్రేక్షకులకు విభిన్నమైన కంటెంట్ అందించేందుకు వస్తున్న ఫిలిమ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఫిలిమ్ యాప్‌లో తొలి చిత్రంగా నవంబర్ 1న పిజ్జా2 మూవీ ప్రీమియర్ కానుంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించగా, గాయత్రి హీరోయిన్‌గా నటించింది.

అంతేకాకుండా త్రిష, నివిన్ పాలీ నటించిన హే జ్యూడ్, మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన రంగూన్ రౌడీ, ప్రియమణి నటించిన థ్రిల్లర్ మూవీ విస్మయ, ధృవ, జేడీ చక్రవర్తి నటించిన మాస్క్ తదితర చిత్రాలను ఫిలిమ్ ఓటీటీ ద్వారా అందించనున్నారు.
ఇక వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే ఓయ్ బేబీ, వెనీలా, ఇండిపెండెంట్ మూవీ ఓమ్' (ఓన్లీ మనీ), సూపర్ హిట్ సినిమాలు గుల్టూ, రుధిరం, గాడ్ ఫాదర్, మహిర, ఇష్క్, వెంకీ, ఢీ, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బద్రి, అతిథి, నీ స్నేహం, గమ్యం చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాలు ఫిలిమ్ ద్వారా అందించేందుకు ఫిలిమ్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు.
ఫిలిమ్ ఓటీటీ యాజమాన్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభిన్నమైన, విలక్షణమైన కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ ధరకు సబ్ స్క్రిప్షన్ ద్వారా అందించాలని ఫిలిమ్ ఓటీటీ ప్రారంభించాం. ఫిలిమ్ ఓటీటీలో అరుదైన కలెక్షన్, పలు జానర్ల చిత్రాలు అందించాలన్ని మా సంకల్పం. మా ఓటీటీలో ప్రీమియర్ అయిన కొత్త సినిమాలను నేరుగా థియేటర్‌లో కూడా విడుదల చేస్తున్నాం. ఇది ఓటీటీ చరిత్రలో కొత్త ట్రెండ్ అవుతుంది. అన్నారు.


Click it and Unblock the Notifications











