‘లవర్‌ను వదిలేసి.. మగాడికి మగాడే తాళి కట్టింది అందుకే..’

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన కోర్ట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండ్ మేళం. కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కోన ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమా ద్వారా సతీష్ జువ్వాజీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కావ్య, శ్రావ్య నిర్మాతలుగా మారి నిర్మించిన ఈ సినిమాకు మ్యాంగో మాస్ మీడియా సమర్పిస్తున్నది. యూత్‌ఫుల్ కామెడీ, లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బేబీ లాంటి సినిమాతో బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. శివ ముప్పరాజు స్క్రీన్ ప్లే ఎఢిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాల్లోని పాటలకు ఆస్కార్ విజేత చంద్రబోస్ సంగీతం అందిస్తున్నారు. నార్ని శ్రీనివాస్ ఆర్ట్ విభాగాన్ని పర్యవేక్షించారు. మార్చి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

Film Maker Kona Venkat about Band Melam

ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణకు ముందు కోన వెంకట్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా కలిసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా టైటిల్ గ్లింప్స్ చూసి ఆయన అందర్నీ అభినందించారు. ఈ గ్లింప్స్‌ను ఆయన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. రోషన్, శ్రీదేవీ ఇద్దరి ప్రతిభను ప్రోత్సహించేందుకు రెడీగా ఉన్నాను అంటూ వారిని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో బీవీఎస్ రవి, దర్శకుడు బాబీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. 2017 సంవత్సరంలో శివ నిర్వాణను మా ఆఫీస్‌లో శివ తుర్లపాటి పరిచయం చేశారు. ఆ సమయంలో శివ నిర్వాణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆ కథ విన్న వెంటనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని అనుకొన్నాను. అదే ప్రేక్షకుల మనసు గెలుచుకొన్న నిన్ను కోరి చిత్రం అయింది. ఆ సినిమాకు 'అన్ని అలవాట్లున్న అబ్బాయిని ప్రేమిస్తారు.. ఏ అలవాటు లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు' అనే కాన్సెప్ట్‌తో డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశాం అని తెలిపారు.

Film Maker Kona Venkat about Band Melam

బ్యాండ్ మేళం సినిమా గ్లింప్స్ విషయానికి వస్తే.. నా ప్రియురాలిని చూస్తే ఒకప్పుడు గుండె పగిలిపోయేది. కానీ ఇప్పుడు పగిలిపోదు. ఎందుకంటే నా గుండెలో ఆమె లేదు. ఈ తాళిని ఆమెకు కట్టాలని అనుకొన్నాను. కానీ మధ్యలో విడిచి పెట్టిన దానికి కాదురా.. చిన్నప్పటి నుంచి నాతో ఉన్న వీడికి కట్టాలిరా అనే డైలాగ్స్‌తో గ్లింప్స్ రిలీజ్ చేశాం. ఈ ఒక్క డైలాగ్ విన్న తర్వాత ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నాను అని కోన వెంకట్ అన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్‌గా సినిమాలు నిర్మించే నిర్మాతను కాదు. మనసుకి నచ్చిన కథ నా ముందుకు వస్తే.. సినిమా తీస్తాను. మంచి కథతో మంచి దర్శకుడిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాను. సినిమా నిర్మాణం వల్ల చాలా మందికి పని లభిస్తుంది. ఈ సినిమా కథ విన్న వెంటనే రోషన్, శ్రీదేవీ మాత్రమే నాకు గుర్తుకు వచ్చారు. ఆ ఇద్దరిని ఒప్పిస్తేనే సినిమా తీస్తాను అని సతీష్‌కు చెప్పాను అనే విషయాన్ని కోన వెంకట్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X