twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇకపై పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుశిక్ష, 10 లక్షల జరిమానా!

    |

    చలనచిత్ర రంగాన్ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని వదిలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇకపై పైరసీ దారులు భయపడేలా కఠినమైన చట్టాల కోసం ప్రభుత్వం 1952 బిల్లుకు సరవరణలు జరిపేందుకు అంగీకారం తెపిపింది. పైరసీ వలన చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి చిత్రం నష్టపోతోంది. కానీ చిన్న నిర్మాతలు ఎక్కువగా గగ్గోలు పెడుతున్నారు.

    తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పైరసీకి పాల్పడిన వ్యక్తులకు మూడేళ్ళ జైలుశిక్ష లేదా 10 లక్షల జరిమానా విధించనున్నారు. కేసు తీవ్రతని బట్టి రెండు శిక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో పైరసీ వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. పైరసీ విషయంలో నిర్మాతల మండలి చైర్మన్ గా ఉన్న విశాల్ స్వయంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

    Film piracy can now land people in jail, B-Town hails move

    తమిళ రాకర్స్ లాంటి పైరసీ సంస్థల్ని గుర్తించడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టాల వలన ఉపయోగం ఏంటని పెదవి విరిచేవారూ లేకపోలేదు. మనదేశంలో మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముందడుకు అంటూ సిద్ధార్థ్ రాయ్ కపూర్ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాడు.

    English summary
    Film piracy can now land people in jail, B-Town hails move
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X