దేవర కలెక్షన్స్ ఫేకా? రియలా?: నిర్మాత నాగవంశీ అదిరిపోయే జవాబు ఏమిటంటే?

Devara Collections: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై తొలుత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే.. దేవర గట్టేక్కుతాడా? లేదా? అనుకున్న సందర్భంలో దిమ్మతిరిగే షాకిచ్చాడు తారక్. విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ జూనియర్ తన మేనియాతో కేవలం వారం రోజుల్లోనే దేవరను ఒడ్డున పడేశాడు. ఈ మూవీ పలు రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఇప్పటివరకూ రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది దేవర సినిమా. ఈ క్రమంలో ఈ కలెక్షన్లు ఫేకా? అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై దేవర సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించారు.

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ "లక్కీ భాస్కర్" దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా.. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి.. సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా.. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. దేవర మూవీ కలెక్షన్లపై స్పందించారు.

Film producer Naga Vamsi interesting comment on Devara collections

ఈ క్రమంలో ఓ రిపోర్టర్.. దేవర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లను తప్పుగా చూపించారనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ జరుగుతుందన్నారు. ఈ ప్రశ్నకు నిర్మాత నాగవంశీ స్పందిస్తూ..'తమకి అందిన లెక్కలనే ఉన్నది ఉన్నట్టు జెన్యూన్ గా రిపోర్టు ఇచ్చాను తప్పా.. ఎలాంటి ఎక్ట్రా కలెక్షన్లు కలపలేదు' అని స్పష్టం చేశాడు. 'నేను ఏది చెప్పినా తప్పు అంటారు. దేవర చిత్రాన్ని కొన్న తన డిస్ట్రిబ్యూటర్స్ లాభాలతో హ్యాపీ గా ఉన్నారు ' అని తెలిపాడు.

కలెక్షన్ల పరంగా ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే నిర్మాతలు హ్యాపీ గా ఉన్నారు. అయితే.. ఈ కలెక్షన్ల ప్రచార సంప్రదాయం హాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలలో ఉందనే అదేం తప్పు కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్షన్ల వివరాలు బహిరంగంగా వెల్లడిస్తే ఐటీ దాడులు చేస్తారనే భయపడుతున్నారని ప్రశ్నించగా.. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ లకు గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్ల గురించి అవగాహన ఉంటుందని, తమకు ఎలాంటి సమస్య లేదని సాలిడ్ గా సమాధానమిచ్చారు.

Film producer Naga Vamsi interesting comment on Devara collections

ఇదెలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా దేవర చిత్రానికి 2 వారాల్లో దాదాపు రూ. 408 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది దేవర. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ కేవలం రెండు వారాల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 184 కోట్లు వసూల్ చేసి.. బ్రేక్ ఈవెన్ చేసింది.
ఇప్పటికీ రూ. 50 కోట్ల లాభాలు దూసుకుపోతుంది దేవర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X