ఎన్టీఆర్ నో అంటే.. ఆయన పిల్లలతో అదుర్స్ సీక్వెల్...కోన వెంకట్ శపథం!
స్టార్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తాజాగా మరోసారి అదుర్స్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్టీఆర్ పిల్లలను ఇందులోకి లాగుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. మరి కోన వెంకట్ మధ్యలోకి ఎన్టీఆర్ వారసులను ఎందుకు తీసుకొచ్చారు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
కోన వెంకట్ స్టార్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ అన్న విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరపైకి తీసుకొచ్చిన ఆయన ప్రస్తుతం అదుర్స్ సీక్వెల్ పై పంతాన్ని వీడట్లేదు. మరోవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు ఆయన మాటలను పట్టించుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయనతో కాకపోతే ఆయన పిల్లలతో సినిమా తీస్తాను అంటూ కోన వెంకట్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో తారక్ నటించిన సినిమాల్లో అదుర్స్ ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో తారక్, బ్రహ్మీ మధ్య పండిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీ సీక్వెల్ వస్తే బాగుంటుంది అని ఎంతోకాలంగా నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అదుర్స్ మూవీ స్క్రిప్ట్ రైటర్లలో ఒకరైన కోన వెంకట్ కూడా తరచుగా సీక్వెల్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కెరీర్లోనే చారి బెస్ట్ క్యారెక్టర్ అని, చారి క్యారెక్టర్ ను ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఇండియాలోనే లేడని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా అవసరమైతే తారక్ ఇంటిముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి అయినా సరే అదుర్స్ 2ను తెరపైకి తీసుకొస్తాను అని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు కోన వెంకట్.

తాజాగా ఆయన మరోసారి అదుర్స్ సీక్వెల్ గురించి మాట్లాడారు. అదుర్స్ 2 సినిమా ఎన్టీఆర్ తో మాత్రమే చేస్తానని, వేరే పాన్ ఇండియా స్టార్ వచ్చి చేద్దాం అన్నా ఒప్పుకోనని తేల్చేశారు. అదుర్స్ 2 స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిందని, ఎన్టీఆర్ విని ఫైనల్ టచ్ ఇస్తే మొత్తం పూర్తయిపోతుందని అప్డేట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రపంచం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపే చూస్తోంది కాబట్టి అదుర్స్ సీక్వెల్ పాన్ వరల్డ్ సినిమా కావాలనే పాయింట్ లో వర్క్ చేస్తున్నానని కోన వెంకట్ తెలిపారు.
అయితే సినిమాలో ఒకరిద్దరు మారితే మారొచ్చు గాని హీరో మాత్రం ఎన్టీఆరే అని, ఆ కథ, పాత్ర పుట్టింది ఎన్టీఆర్ కోసమేనని, చేస్తే ఆయనే చేయాలి లేదంటే ఆ కథ తన దగ్గరే ఉంటుందని ఈ సందర్భంగా కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఎన్టీఆర్ చేయకపోతే ఆయన పిల్లలతోనైనా అదుర్స్ సీక్వెల్ చేస్తానని చెప్పుకొచ్చారు కోన వెంకట్. కానీ ఎన్టీఆర్ వైపు నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. మరి కోన వెంకట్ తన పంతాన్ని ఎలా నెగ్గించుకుంటాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











