అబ్బూరి రవికి విషాదం.. తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో..

వర్థమాన సినీ రచయిత అబ్బూరి రవి విషాదంలో మునిగిపోయారు. ఆయన మాతృమూర్తి లలిత (73) బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న అబ్బూరి రవిని సినీ ప్రముఖులు ఫోన్‌లో పరామర్శించారు. లలిత గారు ఏ లోకాన ఉన్నా ఆమెకు శాంతి చేకూరాలని, అబ్బూరి రవి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పలువురు తమ సంతాప ప్రకటనలో వెల్లడించారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.‌ లలిత గారికి నలుగురు కుమారులు. నలుగురిలో అబ్బూరి రవి ఆఖరి సంతానం.

 Film writer Abburi Ravis mother passes away

అబ్బూరి రవి కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మంచి అభిరుచి గల రచయితగా పేరు తెచ్చుకొన్నారు. ఎలా చెప్పను సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన బొమ్మరిల్లు, భగీరథ, అన్నవరం, డాన్, కొంచె ఇష్టం కొంచెం కష్టం, కిక్, గణేష్, ఎవడు, పంజా లాంటి చిత్రాలకు కథా, మాటల్లో భాగం పంచుకొన్నారు.

ఇటీవల ఆయన రాసిన చిత్రాలు ఎక్కడికి పోతావు చిన్నదాన, ఎవరు, గూఢచారి, డిస్కోరాజా చిత్రాలకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X