Filmfare Awards 2026: నామినేషన్స్ లో పుష్ప 2, కల్కి హవా.. బరిలో నిలిచిన సినిమాలు, నటీనటులు వీరే..
Filmfare Awards 2026: సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 21న కేరళ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా నామినేషన్స్ లిస్ట్ విడుదలైంది. 2024లో విడుదలైన సినిమాల ఆధారంగా ప్రకటించారు. ఈ జాబితాలో తెలుగు సినిమాలు తమ సత్తా చాటాయి. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ (Pushpa 2: The Rule), కల్కి (Kalki 2898 AD), లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమాలు పలు విభాగాల్లో నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించాయి.
ఈ ఏడాది నామినేషన్లలో 'పుష్ప 2: ది రూల్' అత్యధిక విభాగాల్లో చోటు దక్కించుకుని టాప్ రన్నర్‌గా మారింది. ఉత్తమ సినిమా కేటగిరిలో అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు, హను-మాన్, కల్కి 2898 AD, లక్కీ భాస్కర్, సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్, సుకుమార్, ప్రశాంత్ వర్మ, వెంకీ అట్లూరి తదితరులు రేసులో ఉన్నారు.

ఇక ఉత్తమ నటుడు విభాగం ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్), దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), జూనియర్ ఎన్టీఆర్ (దేవర: పార్ట్ 1), నాని (సరిపోదా శనివారం), సిద్ధు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్), తేజ సజ్జ (హను-మాన్) మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే.. ఉత్తమ నటి విభాగంలో అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్), ఆషికా రంగనాథ్ (నా సామి రంగ), మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్), నివేతా థామస్ (35 చిన్న కథ కాదు), ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం), రష్మిక మందన్న (పుష్ప 2: రూల్)వంటి నటీమణులు నామినేట్ కావడం విశేషం.
సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ), ధనంజయ్ (జీబ్రా), ఫహద్ ఫాజిల్ (పుష్ప : ది రూల్), సత్య (మత్తు వదలరా 2), ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం), వినయ్ రాయ్ (హనుమాన్)వంటి నటులు పోటీపడుతుండగా... సహాయ నటి విభాగంలో అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2), రషి సింగ్ నందు (ప్రసన్నవదనం), శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు), శ్రద్ధా శ్రీనాథ్ (మెకానిక్ రాకీ), వరలక్ష్మి శరత్‌కుమార్ (హనుమాన్)తదితరులకు చోటు దక్కింది.
ఇక మ్యూజిక్ విభాగంలో అనిరుధ్ రవిచందర్ (దేవర: పార్ట్ 1), చైతన్ భరద్వాజ్ (హరోం హరా), దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్), జి.వి. ప్రకాష్ కుమార్ (లక్కీ భాస్కర్), గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ (హను-మాన్), జేక్స్ బెజోయ్ (సరిపోదా శనివారం), ఎస్. తమన్ (గుంటూరు కారం)లాంటి కంపోజర్స్ మధ్య పోటీ కనిపిస్తోంది. ఇక బెస్ట్ లిరిక్స్ విభాగంలో కృష్ణకాంత్ (ఆ రోజులు మళ్లీ రావు - కమిటీ కుర్రోళ్లు), రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1), రామజోగయ్య శాస్త్రి (దమ్ మసాలా - గుంటూరు కారం), రామజోగయ్య శాస్త్రి (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం), శ్రీమణి (శ్రీమతి గారు - లక్కీ భాస్కర్)లు పోటీ పడుతున్నారు.
ఇక బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) విభాగంలో అనిరుధ్ రవిచందర్ (ది ఫియర్ సాంగ్ - దేవర: పార్ట్ 1), అనురాగ్ కులకర్ణి (సుట్టంలా సూసి - గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి), అరిజిత్ సింగ్ (అణువణువు - ఓం భీమ్ బుష్), గౌర హరి (పూలమ్మే పిల్ల - హనుమాన్), రామ్ మిరియాల (సూఫియానా - ఆయ్), సంజిత్ హెగ్డే (దమ్ మసాలా - గుంటూరు కారం), శ్రీకృష్ణ (కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం) లు పోటీపడుతుండగా.. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) విభాగంలో మంగ్లీ (గుల్లెడు గుల్లెడు - మెకానిక్ రాకీ), శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1), శ్రేయా ఘోషల్ (సూసేకి - పుష్ప 2: ది రూల్), ఉషా ఉతుప్ (లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్)లు రేసులో నిలిచారు.
ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం.. ఈసారి అవార్డుల్లో 'పుష్ప 2'కు ఎక్కువ గౌరవాలు దక్కే అవకాశముందని అంచనా. అదే సమయంలో 'కల్కి 2898 AD' టెక్నికల్ విభాగాల్లో సత్తా చాటుతుందన్న మాట వినిపిస్తోంది. 'లక్కీ భాస్కర్' నటన, సంగీత విభాగాల్లో బలంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఈసారి తెలుగు సినిమాలకు పెద్ద వేదికగా మారనున్నాయి. స్టార్ హీరోలు, కొత్త టాలెంట్ మధ్య పోటీ ఎలా ముగుస్తుందో చూడాల్సిందే. అభిమానులు మాత్రం ఇప్పటికే తమ ఫేవరెట్ సినిమాలు, నటుల కోసం సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 21న జరిగే ఈ వేడుక.. ఎవరి ఖాతాలో ఎన్ని అవార్డులు పడతాయో తేల్చనుంది.


Click it and Unblock the Notifications











